Prudhvi Raj : నేను ఉగ్రవాదిని.. కొవ్వు, మదం పట్టి మాట్లాడా.. పాత సంగతులు అన్నీ బయటపెట్టిన పృథ్విరాజ్

Prudhvi Raj Opens Up on political journey: 2014 ఎన్నికల ముందే వైసీపీలో చేరి ఆ పార్టీ తరుపున ప్రచారం చేసిన పృథ్విరాజ్ ప్రతిష్ఠాత్మకమైన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌ చైర్మన్ పదవి దక్కింది. కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఇక తాజా ఇంటర్వ్యూలో ఆయన కీలక విషయాలు బయటపెట్టారు.  

Last Updated : Jun 25, 2022, 11:55 AM IST
  • రాజకీయ అనుభవాలు పంచుకున్న పృథ్విరాజ్
  • కీలక వ్యాఖ్యలు చేసిన పృథ్విరాజ్
  • సోషల్ మీడియాలో వైరల్
Prudhvi Raj : నేను ఉగ్రవాదిని.. కొవ్వు, మదం పట్టి మాట్లాడా.. పాత సంగతులు అన్నీ బయటపెట్టిన పృథ్విరాజ్

Prudhvi Raj Opens Up : టాలీవుడ్‌లో థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీగా పృథ్విరాజ్ కి మంచి పేరుంది. ఆయనని పృథ్వి అంటే గుర్తు పడతారో లేదో తెలియదు కానీ థ‌ర్టీ ఇయ‌ర్స్ అనగానే వెంటనే గుర్తు పడతారు. కృష్ణ వంశీ తెరకెక్కించిన 'ఖడ్గం' సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగుతో ఫేమసై.. ఆ తర్వాత 30 ఇయర్స్ పృథ్వీగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాల్లో కూడా తన మార్క్ చూపించారు.  2014 ఎన్నికల ముందే వైసీపీలో చేరి ఆ పార్టీ తరుపున ప్రచారం చేశారు. అయితే 2019 ఎన్నికల్లో ఆయన కూడా ప్రచారం చేయడంతో దానికి ప్రతిఫలంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పృథ్వీకి ప్రతిష్ఠాత్మకమైన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌కు రాఘవేంద్రరావును తప్పించి మరీ చైర్మన్ చేసేసాడు. 

అయితే ఆ పదవి ఎక్కువ కాలం నిలవలేదు.  పృథ్వీ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి ఆయన స్వయంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఆ దెబ్బతో ఆయన పార్టీ నుంచి కూడా క్రమక్రమంగా దూరమయ్యాడు. అప్పట్లో పృథ్వికి సంబంధించిన ఓ ఆడియో సెన్సేషన్ కాగా, త‌న‌పై కుట్ర జ‌రిగిందని తమ పార్టీలో వారే అలా చేశారంటూ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చారు కూడా. ఇక అది అయ్యాక కూడా కొన్నాళ్ళ పాటు పార్టీకి లాయల్ గానే ఉంటూ వచ్చిన ఆయన ఇప్పుడు ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేస్తుండటం హాట్ టాపిక్ అయింది. 

తాజాగా ఓ తెలుగు చానల్ అధినేత నిర్వహంచే టాక్ షోలో పాల్గొన్న ఆయన తమ పార్టీని ఉగ్రవాద సంస్థతో పోల్చడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.  అసలు పార్టీలో ఎందుకు చేరారని అడిగితే పాకిస్తాన్‌లో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చినట్లుగా.. ఒకతను తన మైండ్‌ను పొల్యూట్ చేసి వైసీపీ వైపు నడిపించాడని పృథ్వి పేర్కొన్నాడు. అలాగే అమరావతి విషయంలో పెయిడ్ ఆర్టిస్టులు అంటూ కామెంట్ చేయడం ఏమిటంటూ అడగడంతో తనకు వైసీపీలోకి వెళ్లాక అహంకారం, కొవ్వు, మదం పట్టి నేనే టాప్ అన్నట్లుగా ఏది పడితే అది మాట్లాడేశానని పృథ్వి ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. 

అప్పుడు అక్కడుంది పృథ్వీ కాదు.. ఒక ఉగ్రవాది అని చెబుతూ ఆయన పేర్కొన్నారు. ఇక ఇప్పుడు పవన్ పల్లవి అందుకున్న అయన పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయాడు.. గెలవలేకపోయాడు అని అంటున్నారు.. నీ అమ్మ ఈసారి 10 స్థానాల్లో కాదు.. వచ్చే ఎన్నికల్లో 40 సీట్లు కొట్టబోతోన్నాం.. నేను రాసిస్తాను.. ఘంటాపథంగా చెబుతున్నా జనసేన జెండా ఎగురుతుందని ఆయన చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో పవనే కింగన్న పృథ్వీ 2024లో మంచి బస్సు ఎక్కి ఆ బస్‌కి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నానని, జనసేన బస్సు ఎక్కితే చంద్రబాబు గారితో ఉండొచ్చని కూడా కామెంట్ చేసి రెండు పార్టీల పొత్తుల గురించి కూడా ఆసక్తికర హింట్ ఇచ్చారు. 
Also Read:Actor VP Khalid No More: షూటింగ్లో కన్నుమూసిన నటుడు.. టాయిలెట్‌కి వెళ్లి రాకపోవడంతో?

Also Read: Karan Johar about Shahrukh Khan : షారుక్‌ ఖాన్‌తో శారీరక సంబంధం.. ఆ బుక్లో ఓపెన్ అయిన కరణ్‌ జోహార్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News