Tuck Jagadish: టక్ జగదీష్ రిలీజ్ విషయంలో Nani కి నిర్మాతల మండలి సపోర్ట్

Nani's Tuck Jagadish release issue: నాని హీరోగా నటించిన టక్ జగదీష్ మూవీ రిలీజ్ (Tuck jagadish release) వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతల అసోసియేషన్ చేసిన ఈ ప్రకటన ఆ చిత్ర యూనిట్‌కి మద్ధతుగా నిలిచినట్టయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 23, 2021, 11:37 PM IST
Tuck Jagadish: టక్ జగదీష్ రిలీజ్ విషయంలో Nani కి నిర్మాతల మండలి సపోర్ట్

Nani's Tuck Jagadish release issue: నానికి నిర్మాతల మండలి అండగా నిలిచింది. టగ్ జగదీష్ సినిమా విడుదల విషయంలో నానికి, ఎగ్జిబిటర్స్ కి మధ్య విభేధాలు తలెత్తడం, ఆ తర్వాత వాళ్లు కొంత వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. కరోనా తర్వాత థియేటర్లు మూతపడటం, ఒకవేళ తెరిచినా థియేటర్లలో సినిమాలకు గతంలో మాదిరిగా ఆదరణ లేకపోవడంతో టక్ జగదీష్ సినిమాను థియేటర్లలో కాకుండా ఓటిటి ప్లాట్ ఫామ్స్‌పైనే (Tuck jagadish release on OTT) విడుదల చేయాలని నిర్మాతలు డిసైడ్ కాగా.. నిర్మాతల నిర్ణయాన్ని ఎగ్జిబిటర్స్ తీవ్రంగా వ్యతిరేకించడమే ఈ వివాదానికి కారణమైంది.

అయితే, తాజాగా ఈ వివాదంపై స్పందించిన టాలీవుడ్ చిత్ర నిర్మాతల మండలి.. ఏ చిత్రానికైనా వెన్నెముకగా నిలిచే నిర్మాత సంక్షేమమే తమ తొలి ధ్యేయం అని ప్రకటించింది. ఏదైనా ఒక సినిమాను ఎలా విడుదల చేయాలి, ఏం చేయాలి అనే నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆ చిత్ర నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ, అధికారాలు ఉంటాయని నిర్మాతల సంఘం (Producers association) అభిప్రాయపడింది. 

నాని హీరోగా నటించిన టక్ జగదీష్ మూవీ రిలీజ్ (Tuck jagadish release) వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతల అసోసియేషన్ చేసిన ఈ ప్రకటన ఆ చిత్ర యూనిట్‌కి మద్ధతుగా నిలిచినట్టయింది.

Trending News