AM Ratnam Kushi : ఖుషి సినిమాలోని ఆ ఆలోచనలన్నీ పవన్ కళ్యాణ్‌వే.. ముందు ఆ టైటిల్ అనుకున్నాం.. ఏఎం రత్నం

AM Ratnam about Kushi Songs ఖుషి నిర్మాత ఏఎం రత్నం తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రీ రిలీజ్ మీద స్పందించాడు. ఖుషి నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. ఖుషి పాటలు, ఫైట్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్‌ ఆలోచనలే అని చెప్పుకొచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2022, 01:51 PM IST
  • డిసెంబర్ 31న రాబోతోన్న ఖుషి
  • నిర్మాత ఏఎం రత్నం కామెంట్స్
  • ఖుషి పాటలు, ఫైట్స్‌పై క్రేజీ కామెంట్స్
AM Ratnam Kushi : ఖుషి సినిమాలోని ఆ ఆలోచనలన్నీ పవన్ కళ్యాణ్‌వే.. ముందు ఆ టైటిల్ అనుకున్నాం.. ఏఎం రత్నం

AM Ratnam about Kushi Songs పవన్ కళ్యాణ్‌ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఖుషి నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. ఖుషి సినిమాలోని పాటలైనా, యాక్షన్ సీక్వెన్స్ అయినా, పవన్ కళ్యాణ్‌ లుక్స్ అయినా కూడా అన్నీ ఎంతో ఫ్రెష్‌గా ఉంటాయి. ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయే పాటలను అందించాడు మణిశర్మ. ఇక ఈ పాటల ఐడియాలు సైతం పవన్ కళ్యాణ్‌వే అని నిర్మాత ఏఎం రత్నం చెప్పాడు. ఖుషి సినిమాలోని ఫైట్స్ సైతం పవన్ కళ్యాణ్ కంపోజ్ చేశాడని చెప్పుకొచ్చాడు.

రీ-రిలీజ్ కోసం విడుదల చేసిన ఖుషి ప్రత్యేక ట్రైలర్ అభిమానులను రెండు దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్ళిందని అన్నాడు. ఇద్దరు వ్యక్తుల ఇగోల చుట్టూ తిరిగే సున్నితమైన కథ అయినప్పటికీ, బయటకు మాత్రం ఒక రెగ్యులర్ రొమాంటిక్ ఫిల్మ్ లా కనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. ఎస్‌జె సూర్య కథ చెప్పినప్పుడు, బాగా నచ్చిందని, పవన్ కళ్యాణ్ అయితే స్క్రిప్ట్ విని ఆనందంతో చప్పట్లు కొట్టారని నాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. 

*యే మేరా జహాన్ - పవన్ కళ్యాణ్ అద్భుతమైన ఆలోచనలలో ఒకటి అని, ఆ పాట పూర్తిగా హిందీలోనే ఉండాలని చెప్పాడట. అబ్బాస్ టైర్‌వాలా కేవలం ఒక గంటలో  ఆ పాట రాశారని. ఇది చాలా వినూత్నమైన ఆలోచన అని ఆ పాటకు అంతలా ఆదరణ లభించినందుకు పూర్తి క్రెడిట్ పవన్ కళ్యాణ్ కే దక్కుతుందని ఏం రత్నం అన్నాడు.

పవన్ కళ్యాణ్ స్వయంగా కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఖుషికి ప్రధాన హైలైట్ అని చెప్పుకొచ్చాడు. పోరాటాలు ఏవీ బలవంతంగా చొప్పించినట్లు ఉండవని, సహజంగా రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాలో కలిసిపోయాయని తెలిపాడు. తమిళ వెర్షన్‌ను చూసిన చాలా మంది.. తెలుగు చిత్రం పూర్తిగా కొత్త అనుభూతిని పంచేలా ఉందని ఆశ్చర్యపోయారట. 

తమిళ వెర్షన్‌లో ఖుషీకి మొదట ముత్తమ్(ముద్దు) అనే పేరు పెట్టారట. ఎస్.జె. సూర్య దానిని ప్రేమ వ్యక్తీకరణగా భావించాడట. ఈ టైటిల్ థియేటర్లలోని ప్రేక్షకులను దూరం చేస్తుందని ఏఎం రత్నం భావించాడట. అయితే అనుకోకుండా ఖుషి టైటిల్ అంగీకరించారట. చిరంజీవి చూడాలని వుందిలా చెప్పాలని ఉంది అనే టైటిల్ ఖరారు చేశారట.  

ఒకరినొకరు ప్రేమించుకునే ఇద్దరు వ్యక్తుల గురించి ఉంటుందని, వారి అహం ఆ ప్రేమను వ్యక్తపరచకుండా ఆపుతుందని, కాబట్టి ఆ టైటిల్ సరిపోతుందని అనుకున్నారట. అయితే ఓ రోజు పవన్ కళ్యాణ్ వచ్చి ఖుషి టైటిల్‌ పెడదామని చెప్పాడట. టైటిల్ మార్పుపై డిస్ట్రిబ్యూటర్లు సంతోషించలేదట, కానీ ఖుషి టైటిల్ కాబట్టి పెద్దగా అడ్డు చెప్పలేదట. ఆడువారి మాటలకు.. లాంటి పాపులర్ సాంగ్ ని రీమిక్స్ చేయాలనే ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిందని ఏఎం రత్నం గుర్తు చేసుకున్నాడు.

Also Read : Kushi Re Release Trailer : ఖుషి, ఒక్కడు రీ రిలీజ్.. ట్రైలర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఏది బెటర్ అంటే?

Also Read : Bigg Boss Ashu Reddy : అనాథ పిల్లల్ని చదివిస్తున్న అషూ రెడ్డి.. అందరినీ గెలిచేసిన బిగ్ బాస్ బ్యూటీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News