Prakash raj vs pawan kalyan tweet war on laddu row: ఆంధ్ర ప్రదేశ్ లో తిరుమల శ్రీవారి లడ్డు వివాదం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై స్పెషల్ గా సిట్ ను సైతం ఏర్పాటు చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ ఏకంగా పదకొండు రోజులు పాటు ప్రాయిశ్చిత దీక్ష సైతం చేపట్టారు. అంతే కాకుండా.. ఇటీవల విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్లి అక్కడ కూడా మెట్లను శుభ్రం చేసి ప్రాయిశ్చిత్తం చేశారు. అంతేకాకుండా.. మెట్లపై పసుపు, కుంకు బొట్లు పెట్టి , దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు.
గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం..
ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం… ఏది నిజం?
జస్ట్ ఆస్కింగ్? #justasking— Prakash Raj (@prakashraaj) September 26, 2024
ఇటీవల లడ్డు వివాదంవేళ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై ఎవరైన తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని సీరియస్ అయ్యారు. లడ్డు కల్తీ వెలుగులోకి వచ్చిన తర్వాత.. పవన్ అనేక సందర్భాలలో చాలా ఘాటుగానే స్పందించారు. హిందువులపై మనో భావాలకు దెబ్బతగిలేలా ఘటనలు జరిగితే మాట్లొడొద్దా.. కొన్ని చోట్ల ఆలయాలను, దేవుళ్ల విగ్రహాలను సైతం ధ్వంసం చేస్తున్నారు.
ఒక హిందువైఉండి.. హిందు ధర్మంకు అన్యాయం జరిగితే మాట్లొడొద్దా అంటూ మండిపడ్డారు. వైసీపీ నాయకులు తప్పుచేసిందే కాకుండా.. బరితెగించి మాట్లాడుతున్నారని కూడా ఫైర్ అయ్యారు. ఇదే మజ్జీత్ కు, చర్చికి జరిగితే.. వదిలేస్తారా అంటూ కూడా ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో పవన్ వ్యాఖ్యల్ని నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. దీన్ని జాతీయస్థాయిలో ఏదో వివాదంలా మాట్లొడొద్దని కూడా సెటైర్ లు వేశారు. దీంతో పవన్ విజయవాడలో ప్రకాష్ రాజ్ కు కౌంటర్ ఇచ్చారు. లడ్డుతో అతనికేం సంబంధం.. ఇది తమ మనోభావాలకు చెందిన అంశమన్నారు. మాట్లాడితే.. కరెక్ట్ గా మాట్లాడండీ..లేకుంటే మౌనంగా ఉండాలని నటుడు ప్రకాష్ రాజ్ కు కౌంటర్ ఇచ్చారు.
మరల ప్రకాష్ రాజ్.. పవన్... ఆవేశం వద్దు.. ఆలోచించు అంటూ మరోక పోస్టు పెట్టారు. తాను.. చేసిన పోస్టును మరల చదవాలని కూడా హితవు పలికారు. మరోవైపు కార్తీ సినిమా వేడుకలో.. లడ్డు సున్నితమైన అంశమంటూ వెటకారంగా మాట్లాడారు. దీనిపై కూడా పవన్ మండిపడ్డారు. దీంతో కార్తీ దిగొచ్చిపవన్ కు ఎక్స్ వేదికగా సారీ సైతంచెప్పారు. దీనికి మరల ప్రకాష్ రాజ్.. చెయ్యని తప్పుకు సారీ చెప్పించుకోవడమేంటని మండిపడ్డారు. దీంతో పవన్ వర్సెస్ ప్రకాష్ రాజ్ లో ట్విట్ ల వార్ కొనసాగుతుంది. ఈ క్రమంలో తాజాగా, ప్రకాష్ రాజ్ మరోసారి పవన్ కు షాక్ ఇచ్చారు.
Read more: YS Jagan Declaration: తిరుమలలో వైఎస్ జగన్ అడుగు పెట్టాలంటే అది చేయాల్సిందే! పురంధేశ్వరి ఛాలెంజ్
ఎన్నికలలో గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచాక ఇప్పుడు మరో అవతారం.. ఏంటీ అవాంతారం.. ఎందుకు మనకీ అయోమయం.. అంటూ కూడా సెటైర్ లు వేశారు. దీంతో మరోసారి ప్రకాష్ రాజ్ చేసిన ట్విట్ నిప్పురాజేసిందని చెప్పుకొవచ్చు. మరోవైపు మాజీ సీఎం వైఎస్ జగన్ శనివారం తిరుమలకు వెళ్తానంటూ కూడా ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో డిక్లరేషన్ అంశం వార్తలలో నిలిచింది. వైఎస్ జగన్.. శ్రీవారి మీద నమ్మకముందని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే.. కొండపైకి వెళ్లాలని కూడా ఇప్పటికే బీజేపీ, టీడీపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.