Salaar: సలార్ సినిమాలోని ఖాన్సార్ ప్రదేశం.. నిజంగా ఎక్కడుందో తెలుసా..

Khansar: ప్రస్తుతం ఎక్కడ చూసినా సలార్ హవా కొనసాగుతోంది. ప్రభాస్ హీరోగా చేసిన ఈ చిత్రం నిన్న డిసెంబర్ 22న విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.. కాగా ఈ చిత్రం కథ మొత్తం ఖాన్సార్ ప్రదేశం చుట్టూ తిరుగుతుంది అన్న సంగతి తెలిసిందే..  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2023, 03:47 PM IST
Salaar: సలార్ సినిమాలోని ఖాన్సార్ ప్రదేశం.. నిజంగా ఎక్కడుందో తెలుసా..

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సలార్. కాగా ఈ సినిమా కథ ఖాన్సార్ ఆధిప‌త్య పోరు పైనుంచి జరుగుతుంది.
దేవా (ప్ర‌భాస్‌) అస్సాం ఏరియాలోని బొగ్గు గ‌నుల్లో ప‌నిచేస్తుంటాడు. విదేశాల నుంచి ఇండియాకు వ‌చ్చిన ఆద్య (శృతిహాస‌న్‌) అనే అమ్మాయిని చంప‌డానికి కొంద‌రు ఖాన్సార్ కి సంబంధించిన మనుషులు ప్ర‌య‌త్నిస్తుంటారు. ఆద్య‌ను వెంటాడుతోన్న ఖాన్స‌ర్ మ‌నుషుల‌కు దేవాకు ఉన్న సంబంధం ఏమిటి? ఖాన్స‌ర్‌కు రాజు రాజ‌మ‌న్నార్ (జ‌గ‌ప‌తిబాబు) కొడుకు వ‌ర‌ద‌రాజ‌ రాజ‌మ‌న్నార్‌కు (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌) మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి? చిన్న‌త‌నంలో దేవా త‌ల్లి కోసం రాజ‌మ‌న్నార్ ఎలాంటి త్యాగం చేశాడు? అసలు దేవా కి ఖాన్స‌ర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? అని ప్రశ్నల చుట్టూ ఈ సినిమా సాగుతుంది.

ఇక ఈ చిత్రం చూసిన దగ్గరనుంచి ప్రేక్షకులందరికీ అసలు నిజంగానే ఖాన్స‌ర్‌ అనే ప్రదేశం ఉందా అనే డౌట్ మొదలయింది. కేజిఎఫ్ అనే ప్రదేశం కర్ణాటకలో అప్పట్లో ఉన్నట్టు ఎంతో మంది చెప్పిన సంగతి తెలిసిందే. ఇక దర్శకుడు ప్రశాంత్ సలార్ కి కూడా అలానే ఈ ఖాన్స‌ర్‌ ప్రదేశం తీసుకున్నారని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఈ చోటు ఎక్కడ ఉంది నిజంగా ఉందా లేదా అని తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్.

సలాడ్ చిత్రంలో మాత్రం ఈ నగరం పాకిస్తాన్, గుజరాత్ మధ్య ఉందని చూపించారు. దీంతో నిజంగానే అక్కడ ఈ నగరం ఉందా ? అనే అనుమానాలు వచ్చాయి. కాగా నిజానికి ఖన్సార్ అనే నగరం ఉంది. కానీ సినిమాలో చూపించినట్లుగా పాకిస్తాన్, గుజరాజ్ మధ్య కాదు.. ఖాన్సార్  ఇరాన్ లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్ లో ఉంది. ఇక్కడ 20 వేలకు పైనే పర్షియన్స్ నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో చూపించిన ఖాన్సార్ నగరానికి.. ఇరాన్ లో ఉన్న ఖాన్సార్ కౌంటీకి అసలు పోలికే ఉండదట. 

ఇక ఈ చిత్రం కలెక్షన్స్ విషయానికి వస్తే మొదటి రోజే దాదాపు 100 కోట్ల వరకు వసూలు చేసింది అని అంచనా. కాగా ఈ చిత్రాన్ని దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ అభిమానులను నిరాశ పరచగా.. సలార్ ప్రభాస్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలవడానికి పరుగులు తీస్తోంది.

Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు

Also read: Vitamin D: విటమిన్ డి ఎక్కువైతే ఏమౌతుంది, ఎలాంటి అనారోగ్య సమస్యలెదురౌతాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News