Salaar Record Collection: సలార్ అదిరిపోయే రికార్డ్.. దక్షిణాది హీరోల్లో టాప్ ప్లేస్‌లో ప్రభాస్

Prabhas : బాహుబలి తర్వాత వరుసగా డిజాస్టర్ లు అందుకున్న ప్రభాస్ కెరీర్ కి బ్లాక్ బస్టర్ అందించింది సలార్. బాహుబలి, బాహుబలి 2 లాంటి సినిమాలు ఇక ప్రభాస్ చేయడం అసంభవం అని కొందరు జ్యోస్యం కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ప్రభాస్ తన సలార్ సినిమా తో వారికి గట్టి జవాబు ఇచ్చాడు..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2023, 02:57 PM IST
Salaar Record Collection: సలార్ అదిరిపోయే రికార్డ్.. దక్షిణాది హీరోల్లో టాప్ ప్లేస్‌లో ప్రభాస్

Salaar Record: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లుషన్ సినిమాలతో ప్రభాస్ స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. అప్పటిదాకా టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన్న ప్రభాస్ పేరు ఈ సినిమాల కారణంగా ప్రపంచం మొత్తం మారు మ్రోగింది. కాని ఆ తర్వాత మాత్రం ప్రభాస్ ఆ రేంజ్ సక్సెస్ చూడలేకపోయారు.

సాహో, రాధే శ్యామ్ సినిమాలతో ప్రభాస్ అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచారు. రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు. ముఖ్యంగా రాధే శ్యామ్ సినిమా ప్రభాస్ కెరీర్ లో భారీ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. దీంతో ప్రభాస్ కెరీర్ డీలా పడిపోయింది అని కొందరు కామెంట్లు చేశారు. అసలు ప్రభాస్ కెరీర్ ఇంక అయిపోయినట్టే అని కూడా కొందరు జ్యోతిష్యం చెప్పారు. కానీ ప్రభాస్ ఇప్పుడు ఏకంగా సౌత్ ఇండియా స్టార్స్ లో ఎవరు సాధించని ఒక్క రికార్డ్ సాధించి వారి నోర్లు మూయించారు. మరి ఆ రికార్డ్ ఏమిటో ఒకసారి చూద్దాం..

సలార్ సినిమా సక్సెస్ తో ప్రభాస్ డిజాస్టర్ల పరంపరకి పుల్ స్టాప్ పడింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా అనుకున్న దాని కంటే ఎక్కువగానే హిట్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. 

విడుదల అయిన ఆరు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్ లో
చేరిపోయింది ఈ చిత్రం. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డులు క్రియేట్ చేసిన ఈ చిత్రం విడుదలైన రోజు
నుంచి భారీ వసూళ్లను నమోదు చేసుకుంటూ వచ్చింది. తాజాగా ఈ సినిమా తో ప్రభాస్ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. రూ.500 కోట్ల కలెక్షన్లు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమా లతో.. అందుకున్న ఏకైక దక్షిణాది నటుడిగా ప్రభాస్ నిలిచారు.

మొదట ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి 2 కూడా 500 కోట్ల కలెక్షన్లు సొంతం చేసుకున్నాయి. ఆ తర్వాత 'సలార్’ కూడా ఆ స్థాయి కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో.. మొత్తం పైన ప్రభాస్ తన కెరియర్ లో మీరు 500 కోట్ల సినిమాలు కలిగిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు. ఇలా మూడు 500 కోట్లు సినిమాలు కలిగిన సౌత్ ఇండియా హీరోలు ఎవ్వరు లేకపోవడం గమనార్హం. 

మరో విశేషం ఏమిటి అంటే ఆరు రోజుల వ్యవధి లోనే ప్రభాస్ సలార్ సినిమా ఈ 500 కోట్ల కలెక్షన్స్ సాధించడం ఆయన అభిమానులను తెగ సంబరపరుస్తోంది. మొత్తం పైన టాలీవుడ్ లో మూడు 500 కోట్ల సినిమాలు ఉన్న ఒకే ఒక హీరో గా ప్రభాస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 

Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

Also Read: Oneplus Nord Ce 3 5G Price: అమెజాన్‌లో సగం ధరకే Oneplus Nord Ce 3 5G మొబైల్‌..అదనంగా రూ.18,900 తగ్గింపు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News