Kalki 2898 AD: ఓవర్సీస్ లో ప్రభాస్ ‘కల్కి’ ఖాతాలో మరో రేర్ ఫీట్.. అమెరికాలో ఆగని రెబల్ స్టార్ దూకుడు..

Kalki 2898 AD: బాహుబలి తర్వాత సరైన సక్సెస్ లేని రెబల్ స్టార్ ప్రభాస్.. లాస్ట్ ఇయర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్ సీజ్ ఫైర్ పార్ట్ -1’మూవీతో హీరోగా తన సత్తా చూపించాడు. తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ మూవీ తొలి రోజు తొలి ఆట నుంచే రికార్డుల మీద రికార్డులను బ్రేక్ చేస్తూ పోతుంది. తాజాగా మరో రేర్ ఫీట్ అందుకున్నాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 7, 2024, 04:45 AM IST
Kalki 2898 AD: ఓవర్సీస్ లో ప్రభాస్ ‘కల్కి’ ఖాతాలో మరో రేర్ ఫీట్.. అమెరికాలో ఆగని రెబల్ స్టార్ దూకుడు..

Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్.. ఇది ఓ పేరు కాదు.. ఓ బ్రాండ్.. దానిపైనే ‘కల్కి 2898 AD’ వరల్డ్ వైడ్ గా రికార్డు బ్రేక్  బిజినెస్ చేసింది. ప్రభాస్ కటౌట్ కు మంచి కథ, కథనం ఉంటే చాలు..బాక్సాఫీస్ దగ్గర మాయ చేయడం పక్కా అని మరోసారి ‘కల్కి’ మూవీ సక్సెస్ తో ప్రూవ్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్ లో ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా..  $4.5 మిలియన్ కలెక్షన్స్ రాబట్టింది కల్కి మూవీ . ఇక మొదటి రోజే అక్కడ గా $5 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది.

తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ లో కేవలం 9 రోజుల్లో ఈ సినిమా $15 మిలియన్  యూస్ డాలర్స్ కలెక్ట్ చేసి ఇప్పటికీ అప్రతిహతంగా దూసుకుపోతుంది. ఈ మధ్యకాలంలో ఓవర్సీస్ లో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టిన సినిమా ఏది లేదు. ఓవర్సీస్ లో ఈ రేంజ్ వసూళ్లు రాబట్టి హీరోగా ప్రభాస్ స్టార్ పవర్ ఏంటో తెలియజేసింది. ఈ సినిమా ఇప్పటికే రూ. 800 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. ఇక హిందీ మార్కెట్ లో భారత దేశంలో ఈ సినిమా రూ. 200 కోట్ల నెట్ వసూళ్లతో మరో బెంచె మార్క్ క్రియట్ చేసింది. ఓవరాల్ గా రూ. 412 కోట్ల షేర్ (రూ. 808 కోట్ల గ్రాస్) వసూళ్లతో ఈ సినిమా దూసుకుపోతుంది.

 నెక్ట్స్ వీకెండ్ వరకు ఈ సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ అందుకోవడం పక్కా అని చెప్పొచ్చు. ఒకవేళ అందుకుంటే ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ కెరీర్ లో రెండో వెయ్యి కోట్ల సినిమా అని చెప్పొచ్చు. తెలుగులో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ తర్వాత రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన మూడో చిత్రంగా ‘కల్కి’ రికార్డులకు ఎక్కనుంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ పార్ట్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీటైంది. ఈ సినిమాకు ‘కల్కి 3102 BC’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ద్వాపర యుగంలో మహా భారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణ భగవానుని పరమపదించడంతో ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రారంభమవుతోంది. ఈ సినిమా వచ్చే యేడాది మే 9న విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. త్వరలో రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారు.  

Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News