Prabhas: ఆ విషయంలో తెలుగులో ప్రభాస్ మించిన తోపు హీరో ఎవరు లేరు.. ? ఇదిగో ఫ్రూవ్..

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్.. తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ తర్వాత ప్రభాస్ ప్రతి సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలవుతోంది. గతేడాది చివర్లో 'సలార్' మూవీతో పలకరించారు. ఈ సందర్భంగా ప్రభాస్ తెలుగులో మరో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. తెలుగులో మరే ఇతర హీరో ఈ రికార్డు రీచ్ కావడం అంత ఈజీ కాదు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 13, 2024, 10:40 AM IST
Prabhas: ఆ విషయంలో తెలుగులో  ప్రభాస్ మించిన తోపు హీరో ఎవరు లేరు.. ? ఇదిగో ఫ్రూవ్..

Prabhas:బాహుబలి సక్సెస్ తర్వాత ప్రభాస్ మార్కెట్ రేంజ్ పెరిగింది. అంతేకాదు ఆయన సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్‌లో ఇంతింతై అన్నట్టు పెరుగుతూ వస్తోంది. గతేడాది చివర్లో విడుదలైన 'సలార్' మూవీ కూడా పెద్ద మొత్తంలో బిజినెస్ చేసింది. అంతేకాదు అదే రేంజ్‌లో ఈ సినిమా వసూళ్లను రాబట్టింది. 

సలార్: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రన్ ముగిసింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 337.43 కోట్ల షేర్ రాబట్టింది. తెలుగులో రూ. 217.13 కోట్ల షేర్ రాబట్టింది.  మొత్తంగా ఈ సినిమా గతేడాది తెలుగులో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులను నెలకొల్పింది. 

అటు ఆదిపురుష్: ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రభు శ్రీరాముడిగా నటించిన సినిమా 'ఆదిపురుష్'. రామాయణాన్ని పూర్తిగా వక్రీకరించి తెరకెక్కించి ఈ సినిమా ఫ్లాప్‌ టాక్‌తో కూడా రూ. 200 కోట్ల షేర్ రాబట్టం విశేషం. తెలుగులో రూ. 109.50 కోట్ల షేర్ రాబట్టి హీరోగా ప్రభాస్ రేంజ్ ఇది అనేలా చేసింది.  

ఆదిపురుష్ కంటే ముందు రాధే శ్యామ్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'రాధే శ్యామ్'. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 83.20 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. తెలుగులో రూ. 72.20 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా డిజాస్టర్‌ టాక్‌తో ఈ సినిమా ఈ రేంజ్ వసూళ్లను  రాబట్టడం  వెనక ప్రభాస్ ఇమేజ్ పని చేసింది. 

సాహో: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 218.45 కోట్ల షేర్ రాబట్టింది. ఇందులో మెజారిటీ వాటా హిందీ నుంచే దక్కడం విశేషం. తెలుగులో మాత్రం రూ. 112.73 కోట్ల షేర్ రాబట్టింది. 

బాహుబలి 2: రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన 'బాహుబలి 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 860 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఇప్పటి వరకు ఈ రేంజ్ మన దేశంలో రాబట్టిన సినిమా ఏది లేదు. అంతేకాదు తెలుగులోనే కాదు మన దేశంలో హైయ్యెస్ట్ వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఒక్క తెలుగులోనే రూ. 320 కోట్ల షేర్ రాబట్టింది. 

బాహుబలి 1: రాజమౌళితో చేసిన బాహుబలి 1 సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 304 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను ఈ సినిమా స్మాష్ చేసింది. కేవలం తెలుగు భాషలోనే రూ. 194 కోట్ల షేర్ రాబట్టింది. 

మొత్తంగా బాహుబలి నుంచి సలార్ వరకు ప్రభాస్ సినిమాల కలెక్షన్స్ కలిపితే.. రూ. 2003.08 కోట్ల వసూళ్లను రాబట్టింది. అటు తెలుగు వెర్షన్ విషయానికొస్తే.. రూ. 1025.56 కోట్ల వసూళ్లను రాబట్టిన హీరోగా రికార్డులకు ఎక్కాడు. మరే ఇతర హీరో గత ఆరు చిత్రాల కలెక్షన్స్ కలిపిన ఇంత ఉండదు. రాబోయే కాలంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలు ప్యాన్ ఇండియా సినిమాలతో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికైతే తెలుగులో ఎక్కువ గత ఆరు చిత్రాలతో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టిన హీరో ప్రభాస్ మాత్రమే అని చెప్పాలి. 

Also read: Ujjwala Yojana Free Gas Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్..ఉచితంగా 75 లక్షల వంట గ్యాస్ సిలిండర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News