Pawan Fan Murderd: పవన్‌ కల్యాణ్‌ అభిమానిని కొట్టి చంపిన ప్రభాస్‌ ఫ్యాన్‌..ఇదేం శాడిజం అయ్యా?

Pawan Kalyan Fan Murderd by Prabhas Fan: పశ్చిమగోదావరి జిల్లాలోని అత్తిలిలో ఈ ఫ్యాన్ వార్ కలకలం రేపింది, వాట్సాప్ స్టేటస్ కారణంగా పవన్ అభిమాని, ప్రభాస్ అభిమాని గొడవ పడ్డారు. ఆ గొడవలో ఒకరు చనిపోయినట్లు తెలుస్తోంది.

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 23, 2023, 10:12 AM IST
Pawan Fan Murderd: పవన్‌ కల్యాణ్‌ అభిమానిని కొట్టి చంపిన ప్రభాస్‌ ఫ్యాన్‌..ఇదేం శాడిజం అయ్యా?

Prabhas Fan Murderd Pawan Kalyan Fan in Attili: ఒకప్పుడు సినీ హీరోల అభిమానుల మధ్య మంచి వాతావరణంలో పోటీ ఉండేది. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని వాదించుకునేవారు. తమ హీరోల పేరు ఏ మాత్రం చెడిపోకుండా వారి తరఫున సేవా కార్యక్రమాలు లాంటివి కూడా చేస్తూనే ఉండేవారు. అయితే అదంతా ఒక్కప్పటి సంగతి ఇప్పటి హీరోల అభిమానులు అందరూ సోషల్ మీడియాలోనే ఫ్యాన్ వార్స్ కి దిగుతున్న సంగతి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ -మెగా ఫ్యాన్స్ మధ్య మెగా ఫ్యాన్స్ -నందమూరి ఫ్యాన్స్ మధ్య, మహేష్ బాబు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఇలా రకరకాల విధాలుగా అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఫ్యాన్ వార్స్ కల్చర్ ఇప్పుడు బరితెగించే విధంగా సాగుతోంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలోని అత్తిలిలో ఈ ఫ్యాన్ వార్ కలకలం రేపింది. తమ అభిమాన హీరోల గురించి ఇద్దరు పెయింటర్ల మధ్య మొదలైన ఘర్షణ హత్యకు దారితీసింది. అసలు విషయం ఏమిటంటే ఏలూరుకు చెందిన పెయింటర్లు అత్తిలి మసీదు వీధిలో నజీర్ అనే ఒక వ్యక్తికి ఇంటికి పెయింట్ వేసేందుకు వచ్చారు. ఆ పెయింట్ వేస్తున్న సమయంలో వాట్సాప్ స్టేటస్ కారణంగా గొడవ పడ్డారు. ఆ గొడవలో ఒకరు చనిపోయినట్లు తెలుస్తోంది.

Also Read: Pooja Hegde's List: పూజా హెగ్డే లిస్టులో మరో డిజాస్టర్.. పాపం మరక మనేలా లేదే!

మూడు రోజుల క్రితం హరి కుమార్, కిషోర్ అనే ఏలూరుకు చెందిన పెయింటర్లు అత్తిలికి వెళ్లారు. వారిలో పెయింటర్ హరికుమార్ ప్రభాస్ అభిమాని, దీంతో హరికుమార్ తన వాట్సాప్ స్టేటస్ లో ప్రభాస్ వీడియోని పెట్టుకున్నాడు. మరో పెయింటర్ కిషోర్ మాత్రం పవన్ కళ్యాణ్ అభిమాని ఈ క్రమంలో నేను పవన్ కళ్యాణ్ అభిమానిని కదా అందుకే నువ్వు కూడా ప్రభాస్ వీడియో తీసి పవన్ కళ్యాణ్ వీడియో స్టేటస్గా పెట్టుకోమని హరికుమార్ని కోరాడట.

దానికి హరికుమార్ ఒప్పుకోలేదు సరి కదా నేను ప్రభాస్ కి వీరాభిమానిని ప్రభాస్ వీడియోనే పెట్టుకుంటా పవన్ కళ్యాణ్ వీడియో పెట్టేది లేదని తేల్చి చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైందట. ఆ వాగ్వాదం అర్ధరాత్రి సమయానికి మరింత ముదిరి ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్లిందని తెలుస్తోంది. ఈ క్రమంలో తన అభిమాన హీరో వీడియో తీసేయమని బలవంతం చేసిన కిషోర్ని హరికుమార్ ఒక సెంట్రింగ్ కర్రతో బలంగా తల మీద కొట్టాడు, అక్కడే ఉన్న సిమెంట్ రాయితో ముఖం మీద కూడా దాడి చేశాడు.

తీవ్ర గాయాలు కావడంతో కిషోర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. కిషోర్ చనిపోయిన విషయం అర్థం అయిన వెంటనే హరికుమార్ అప్పటికప్పుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ హత్యకు సంబంధించిన వివరాలు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కిషోర్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు హరికుమార్ను ట్రేస్ చేసేందుకు ప్రత్యేకమైన టీములను నియమించినట్లుగా తణుకు రూరల్ పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనా తమ అభిమాన హీరోల కోసం ఈ విధంగా అభిమానులు ఒకరినొకరు కొట్టుకుని చంపుకోవడం దారుణమైన విషయం అనే చెప్పాలి.
Also Read: Virupaksha Promotions: చూశాక మళ్లీ పోయడానికి ఇక్కడికే వస్తారు.. టాయిలెట్స్ లో 'విరూపాక్ష' అరాచకం ప్రమోషన్స్ చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News