Pushpa Trailer Launch: ‘పుష్ప’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ఛీఫ్ గెస్ట్ గా ప్రభాస్?

Pushpa Trailer Launch: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా ట్రైలర్ ను డిసెంబరు 6న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ (Pushpa Trailer Release Date) కార్యక్రమాన్ని బాలీవుడ్ లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2021, 09:26 AM IST
    • ‘పుష్ప’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు మేకర్స్ భారీ సన్నాహాలు
    • కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెబల్ స్టార్ ప్రభాస్?
    • డిసెంబరు 6న జరగనున్న ట్రైలర్ లాంచ్ వేడుక
Pushpa Trailer Launch: ‘పుష్ప’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ఛీఫ్ గెస్ట్ గా ప్రభాస్?

Pushpa Trailer Launch: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పుష్ప’ సినిమా ట్రైలర్ (Pushpa Movie Trailer) విడుదలపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చేసింది. డిసెంబరు 6న ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ (Pushpa Trailer Release Date) చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని గ్రాండ్ ప్లాన్ చేయనున్నారని సమాచారం. ముంబయిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఓ స్టార్ హీరోను ముఖ్య అతిథిగా పిలవనున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్.. టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ విచ్చేయనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇదే నిజమైతే రెబల్ స్టార్, ఐకాన్ స్టార్లను ఒకే వేదికపై చూసేందుకు ఫ్యాన్స్ కు రెండు కళ్లు చాలవు.  

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్లుగా ‘పుష్ప’ చిత్రం రూపొందింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్న తొలి భాగం డిసెంబరు 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం సినిమా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సినిమా రిలీజ్ దగ్గర పడనుండడం వల్ల చిత్ర ప్రమోషన్స్ ను మేకర్స్ శరవేగంగా మొదలుపెట్టారు. గత కొన్ని నెలలుగా సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ప్రేక్షకుల్లో సినిమా క్రేజ్ పెంచేస్తున్నారు. ఈ ఏడాది అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా విడుదలైన గ్లింప్స్ తో ప్రమోషన్స్ షురూ అయ్యాయి.

ఆ తర్వాత సినిమాలోని పాత్రలను పరిచయం చేయడం సహా తొలి లిరికల్ సాంగ్ ‘దాక్కో దాక్కో మేక‘ను ఆగస్టు 13న చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ పాటకు ఫ్యాన్స్ నుంచి విపరీతమైన ఆదరణ దక్కింది. ఆ తర్వాత వరుసగా ‘శ్రీవల్లీ’, ‘సామి సామి‘, ‘ఏ బిడ్డా ఇది నా అడ్డా‘ పాటలు సోషల్ మీడియాలో అదరగొడుతున్నాయి.

ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మికతో పాటు మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్, యాంకర్ అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మెయిన్ విలన్ ఫహద్ ఫాసిల్ అంటూ ప్రచారం జరుగుతూ ఉండగా అది నిజం కాదని మొదటి భాగం చివర్లో ఆయన వస్తాడు అని సునీలే సినిమాలో మెయిన్ విలన్ అని స‌మాచారం. చిత్రంలో సునీల్ మంగళం శ్రీనుగా, అనసూయ దాక్షాయణిగా స‌రికొత్త లుక్‌లో (Pushpa Movie Trailer) సంద‌డి చేయ‌నున్నారు.

Also Read: Shiva Shankar Master: శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తి... పాడె మోసిన యాంకర్‌ ఓంకార్‌..

Also Read: Radhe Shyam Song Teaser: ప్రభాస్ ‘రాధేశ్యామ్’ నుంచి రెండో సాంగ్ టీజర్ వచ్చేసింది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News