Prabhas: భారతీయ సినీ చరిత్రలో ప్రభాస్ ఒకే ఒక్కడు.. మొత్తంగా 4 సార్లు ఆ రికార్డు రెబల్ స్టార్ కే సొంతం..

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తెలుగు సినిమా స్టార్ కాదు. భారతీయ సినిమాలకు పెద్ద దిక్కుగా మారాడు. ప్రస్తుతం ప్రభాస్ సినిమా వస్తుందంటే మొత్తం భారతీయ సినీ పరిశ్రమ ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. తాజాగా కల్కి మూవీతో మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 4, 2024, 10:26 AM IST
Prabhas: భారతీయ సినీ చరిత్రలో ప్రభాస్ ఒకే ఒక్కడు.. మొత్తంగా 4 సార్లు ఆ రికార్డు రెబల్ స్టార్ కే సొంతం..

Prabhas: బాహుబలి సినిమాతో ప్రభాస్ రికార్డుల పరంపర మొదలైంది. మధ్యలో కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు సాధించకపోయినా హీరోగా ప్రభాస్ స్టార్ డమ్ ఏమి తగ్గలేదు. గతేడాది సలార్ మూవీ దాదాపు రూ. 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను బాక్సాఫీస్ వద్డ కొల్లగొట్టిన రెబల్ స్టార్.. తాజాగా ‘కల్కి’ మూవీ అదే పరంపరను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ‘కల్కి 2898 AD’ మూవీ గ్లోబల్ లెవల్లో బాక్సాఫీస్ దగ్గర పూటకో రికార్డు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటికే రూ. 600 కోట్ల గ్రాస్ క్లబ్బును దాటి రూ. 700 కోట్లు క్లబ్బులో ప్రవేశించింది.

ఇక తెలుగు కాదు.. మన భారతీయ సినీ చరిత్రలో కల్కి మూవీ ప్రభాస్ కెరీర్ లో 4వ రూ. 600 కోట్ల చిత్రం. గతంలో బాహుబలి, పార్ట్ -1, పార్ట్ 2 సినిమాలు రూ. 600 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాయి. లాస్ట్ ఇయర్ చివర్లో విడుదలైన ‘సలార్’ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర రూ. 600 కోట్ల గ్రాస్ వసూళ్లను క్రాస్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ విడుదలైన వారం లోపే రూ. 650 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. తాజాగా రూ. 700 కోట్ల క్లబ్బులో ప్రవేశించింది.

మొత్తంగా  ప్రభాస్ కెరీర్ రూ. 600 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రాలు నాలుగు ఉన్నాయి. భారతీయ సినీ పరిశ్రమలో మరే హీరో కూడా రూ. 600 కోట్ల గ్రాస్  వసూళ్లను రాబట్టలేదు. మొత్తంగా ప్రభాస్ రాబోయే సినిమాలతో ఈ రికార్డులను తిరగ రాయడం ఖాయం అనిపిస్తోంది. ఈ సినిమా ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను క్రాస్ చేయడం పక్కా చెప్పొచ్చు. మొత్తంగా ఈ సినిమాకు పోటీగా ఏ సినిమా లేకపోవడంతో పాటు.. బాక్సాఫీస్ కు డల్ సీజన్ లో విడుదలైన ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.

Also Read: C Naga Rani IAS: వెస్ట్‌ గోదావరికి పవర్‌ ఫుల్‌ ఆఫీసర్‌.. ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే అందరికీ హడలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News