Pooja Hegde: సిటీలో ఖరీదైన ఇంటికి ప్లాన్ చేస్తున్న కన్నడ బ్యూటీ

పూజా హెగ్డే టాలీవుడ్‌లో బ్యాక్-టు-బ్యాక్ హిట్ చిత్రాలు చేస్తూ ఒకదాని తర్వాత మరొకటిగా వరుసగా అవకాశాలు అందుకుంటోంది. అల్లు అర్జున్‌తో ( Allu Arjun ) పూజా చివరి చిత్రం, అల వైకుంఠపురములో.. ఇప్పటివరకు 2020లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

Last Updated : Sep 3, 2020, 10:55 PM IST
Pooja Hegde: సిటీలో ఖరీదైన ఇంటికి ప్లాన్ చేస్తున్న కన్నడ బ్యూటీ

పూజా హెగ్డే టాలీవుడ్‌లో బ్యాక్-టు-బ్యాక్ హిట్ చిత్రాలు చేస్తూ ఒకదాని తర్వాత మరొకటిగా వరుసగా అవకాశాలు అందుకుంటోంది. అల్లు అర్జున్‌తో ( Allu Arjun ) పూజా చివరి చిత్రం, అల వైకుంఠపురములో.. ఇప్పటివరకు 2020లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అంతే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ( Mahesh Babu ) కలిసి మహర్షి మూవీలోనూ కనిపించింది. Also read : Singer Sunitha: బిగ్ బాస్ 4లో ఎంట్రీపై స్పందించిన సింగర్ సునీత

పూజా హెగ్డె తాజాగా హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇల్లు కొనాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న పూజా హెగ్డే టాలీవుడ్‌లోనే ఎక్కువ బిజీగా ఉంటుండటంతో ఇకపై షూటింగ్స్‌కి మరింత అందుబాటులో ఉండటం కోసం త్వరలోనే హైదరాబాద్‌లో ఒక ఇంటిని కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది ( Pooja Hegde to buy house in Hyderabad ). పూజాని హైదరాబాద్ నగరం ఎంతో ఆకర్షితురాలుని చెసిందని, అందువల్ల ఇక్కడే ఇల్లు కొనడానికి చాలా ఆసక్తిగా ఉంది అని టాలివుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. Also read : Adipurush Villain: ‘ఆది పురుష్’ విలన్ ఎవరో చెప్పిన ప్రభాస్

ఇదే నిజమైతే, పూజా హెగ్డేకు హైదరాబాద్‌లో సొంతిల్లు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని, ఎందుకంటే ప్రభాస్ 'రాధే శ్యామ్' ( Prabhas's Radhe shyam ), అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ( Most eligible bachelor ) షూటింగ్స్ కోసం ఎక్కువగా హైదరాబాద్‌లో ఉండవలసి ఉంటుందని ఆమెకు సన్నిహితంగా ఉండే సినీవర్గాలు చెబుతున్నాయి. Also read : #NS20 Shooting: సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం

Trending News