ఈ ఫొటోలో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

Pooja Hegde Childhood Photos: సినీ తారలు ఏం చేసినా.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతాయి. ముఖ్యంగా హీరోయిన్ల అందాల ఆరబోత ఫొటోలు ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతుంటాయి. ఈ క్రమంలో టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ కు సంబంధించిన ఓ ఫొటో వైరల్ గా మారింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2021, 03:12 PM IST
ఈ ఫొటోలో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

Pooja Hegde Childhood Photos: సెలెబ్రిటీలకు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా సినీ తారల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. సోషల్ మీడియాలో వారు ఏ ఫొటో పోస్ట్ చేసినా.. వారికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇలా ‘త్రోబ్యాక్’ ఫోటో అంటూ తమ ట్విట్టర్ అకౌంట్లలో షేర్ చేసినా.. వెంటనే వాటికి విపరీతమైన క్రేజ్ లభిస్తోంది.

ఈ క్రమంలో టాలీవుడ్ కు చెందిన టాప్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

నాగచైతన్య సరసన ‘ఒక లైలా కోసం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మదిని దోచి, బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సరసన ‘మొహంజదారో’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత ‘ముకుందా’, ‘డీజే’, ‘అరవింద సమేత..’, ‘అల..వైకుంఠపురంలో..’, ‘మోస్ట్ ఎలిజెబుల్ బ్యాచిలర్’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.  

ప్రస్తుతం ఇటు టాలీవుడ్ తో సహా బాలీవుడ్ లోనూ అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. దాదాపు టాలీవుడ్‌లో యువ హీరోలతో నటించడమే కాకుండా.. మెగా కాంపౌండ్, అక్కినేని వారసులతో కూడా నటించి మెప్పించింది. 

ఇప్పటికే ఆమె ఎవరో మీకు అర్థం అయ్యే ఉంటుంది. అవును, ఆమె ఎవరో కాదు.. మన బుట్టబొమ్మ ‘పూజా హెగ్డే’. ప్రస్తుతం ఆమె ‘ఆచార్య’, ‘సర్కస్’, ‘రాధే శ్యామ్‘, ‘బీస్ట్‘ చిత్రాల్లో నటిస్తోంది.

Also Read: Alina Rai looks: అచ్చు గుద్దినట్టు కత్రినా కైఫ్ పోలికలే..అలీనా వర్సెస్ కత్రినా 

Also Read: Pushpa Trailer: పుష్ప ట్రైలర్‌ బాగా నిరాశపరిచింది.. అబ్బే ఊహించినంతగా లేదబ్బా!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News