Political Movies in Tollywood: అవువు 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి అధికార తెలుగు దేశం పార్టీ.. ఎన్టీఆర్ జీవితంపై ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా ఎన్టీఆర్ కథానాయకుడు.. ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ మహానటుడి జీవితాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు వదిలారు. ఈ మూవీలు అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు ఇక అన్నగారి జీవితంలో కేవలం పాజిటివ్ అంశాలనే తీసుకొని తెరకెక్కించిన ఈ మూవీని బయోపిక్ అనలేము. కేవలం ఆయన రెండోసారి ముఖ్యమంత్రి ఎలా అయ్యారు. అందుకు ఎలాంటి కష్టనష్టాలను ఫేస్ చేసారనేదే ఈ సినిమాలో చూపించారు. ఈ మూవీ చూసిన కొంత మంది ఇది ఎన్టీఆర్ బయోపిక్ అనే కంటే మహానటుడు సతీమణి బసవతారకంగారి బయోపిక్ అని కొంత మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ కూడా చేశారు. ఆ సంగతి పక్కన పెడితే మరోవైపు ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో జరిగిన సంఘటలను చూపించలేదు. అయితే.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన సంఘటనలతో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీపై అప్పటి తెలుగు దేశం పార్టీ కత్తి కట్టి విడుదల కాకుండా ఎన్నో ప్రయత్నాలు చేసినా.. చివరకు థియేటర్స్‌లో విడుదలై ఓ మోస్తరు విజయం సాధించింది. ఈ మూవీ అప్పటి ప్రతిపక్ష వైయస్‌ఆర్సీపీకి అనుకూలంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు వర్మ్ తెలిపారు.
అటు దివంగత ఏపీ మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన 'యాత్ర' మూవీ మంచి విజయాన్ని సాధించింది. మహి వి రాఘవ్ తెరకెక్కించారు. ఒక రకంగా యాత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్.. అప్పటి ప్రతిపక్ష వైసీపీకి అనుకూలంగా మంచి ప్రచారాన్నే ఇచ్చాయి. ఇక సినిమాలు రాజకీయాలను ప్రభావితం చేస్తాయని చెప్పలేము కానీ.. ఈ మూవీ అప్పటి తెలుగు దేశం పార్టీ గద్దె దిగడానికి ఒకింత సాయం చేసాయనే టాక్ అయితే వినిపడింది. అటు అమ్మ రాజ్యంలో కడపబిడ్డలు, పవర్ స్టార్ సినిమాలు ఈ కోవలో తెరకెక్కినవే.
తాజాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎవరి వ్యూహాలకు వారు పదును పెడుతున్నారు. అందుకోసం సినిమాలను వాడుకుంటున్నారు. ఈ కోవలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లక్ష్యంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'వ్యూహం' సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా విడుదల అడ్డుకోవడానికి అవసరమైన అన్ని మార్గాల్లో ప్రయత్నించి ఒకింత సక్సెస్ అయిందనే చెప్పాలి. అటు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కూడా ఈ సినిమాను మళ్లీ రీ సెన్సార్ చేయమని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికల లోపు ఈ సినిమా విడుదల కావడం ఒకింత డౌటే అని చెబుతున్నారు. ఈ సినిమాను రిలీజ్ ఉన్న అన్ని దారులను మూసేలా టీడీపీ తన ప్లాన్ అమలు చేసే పనిలో పడింది.
అటు యాత్ర 2 అంటూ వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో తెలుగు వాళ్లు తమిళ, మలయాళ నటులు నటించారు. తెలుగు వాళ్లు ఎవరైనా నటిస్తే.. వారికి ఇక భవిష్యత్తు ఉండదనే కారణంతో పెద్ద నటులు ఎవరు ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు. ఒక రకంగా వ్యూహం, యాత్ర 2 సినిమాలు ఏపీలో అధికార వైయస్‌ఆర్సీపీకి అనుకూలంగా తెరకెక్కిన సినిమాలనే చెప్పాలి.
అటు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెక్ పెట్టడానికి టీడీపీ వాళ్లు 'రాజధాని ఫైల్స్' అంటూ ఓ సినిమాను తెరకెక్కించారు. ఒక్కడి అహం వేల మంది రైతుల కన్నీరు.. కోట్ల కుటుంబాల భవిష్యత్తు అంటూ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటూ అమరావతి రైతులను పట్టించుకోవడం లేదనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఈ పొలిటికల్ మూవీస్‌లో ఏ పార్టీకి చెందిన ఎజెండా వారికుంది. ఎవరి యాంగిల్‌లో చూస్తే వారిది కరెక్ట్ అనేలా ఈ సినిమాలను రూపొందించారు. మరి ఈ రాజకీయ చిత్రాలను ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారనేది చూడాలి. మరోవైపు సినిమాలను చూసిన ప్రజలు ప్రభావితులు అవుతారా అనేది వెయిట్ అండ్ సీ. ఏది ఏమైనా ఇపుడు ఏపీలో రాజకీయ చిత్రాలు కూడా పొలిటికల్‌గా హీట్ పెంచుతున్నాయనే చెప్పాలి.
ఇదీ చదవండి: Ruchaka Rajyog 2024: రుచకరాజ్యయోగం ఈరాశికి ప్రత్యేకం.. మార్చిలోగా కొత్త ఉద్యోగం, కాసులవర్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook