Singer Harini : సింగర్‌ హరిణి కుటుంబం అదృశ్యం, అనుమానస్పద స్థితిలో తండ్రి మృతదేహం లభ్యం

Harini's Father AK Rao Found Suspicious Death:హైదరాబాద్‌లో నివసిస్తున్న హరిణి కుటుంబ సభ్యులు వారం రోజుల కింద అదృశ్యమయ్యారు. దీంతో పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఏకేరావు మృతదేహం లభ్యమైంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2021, 01:46 PM IST
  • ప్రముఖ ప్లేబ్యాక్‌ సింగర్‌ హరిణి తండ్రి ఏకే రావు అనుమానాస్పద స్థితిలో మృతి
  • బెంగళూరులోని ఓ రైల్వేట్రాక్‌పై ఏకే రావు మృతదేహం లభ్యం
  • హైదరాబాద్‌లో నివసిస్తున్న హరిణి కుటుంబ సభ్యులు వారం రోజుల కింద అదృశ్యం
Singer Harini : సింగర్‌ హరిణి కుటుంబం అదృశ్యం, అనుమానస్పద స్థితిలో తండ్రి మృతదేహం లభ్యం

Playback Singer Harini Family Missing, Harini's Father AK Rao Found Suspicious Death: ప్రముఖ ప్లేబ్యాక్‌ సింగర్‌ హరిణి తండ్రి ఏకే రావు అనుమానాస్పద స్థితిలో మరణించారు. బెంగళూరులోని ఓ రైల్వేట్రాక్‌పై ఏకే రావు (AK Rao) మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో (Hyderabad) నివసిస్తున్న హరిణి కుటుంబ సభ్యులు వారం రోజుల కింద అదృశ్యమయ్యారు. దీంతో పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఏకేరావు మృతదేహం లభ్యమైంది.

హరిణి తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలో సింగర్ గా (Singer) మంచి పేరు తెచ్చుకొంది. వారం రోజుల క్రితం హరిణి కుటుంబం మిస్ అయినట్లు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో (Police Station) కేసు నమోదైంది. ఏకే రావు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నుండి రిటైరైన తర్వాత సుజనా ఫౌండేషన్ కు (Sujana Foundation) సీఈఓగా పని చేశారు. వారం రోజులుగా ఏకే రావు కార్యాలయానికి రాలేదని అక్కడ పనిచేసేవారు చెప్పారు. బెంగుళూరులోని రైల్వే ట్రాక్ పై (Railway track in Bangalore) మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. ఏకే రావు మృతదేహం గురించి కుటుంబ స‌భ్యుల‌కు సమాచారం ఇచ్చేందుకు పోలీసులు (Police) ప్రయత్నించగా వారి ఫోన్లు పని చేయలేదు. 

అయితే హరిణి కుటుంబీకులు ఇన్నాళ్లు ఏమైపోయారు.. ఆయ‌న‌ను చంపాల్సిన అవ‌స‌రం ఏముంది ఇలా ర‌కార‌కాలుగా పోలీసులు విచార‌ణ కొనసాగిస్తున్నారు. అయితే మృతదేహం దగ్గర సూసైడ్ నోట్ లభ్యమైందని.. ఓ వ్యాపారి తనను మోసం చేశారంటూ సూసైడ్ నోట్‌లో ఉందని సమాచారం. బెంగళూర్ పోలీసులు (Police) కుటుంబ సభ్యుల నుంచి స్టేట్‌మెంట్‌లు రికార్డ్ చేస్తున్నారు.

Also Read : Pocharam Srinivas reddy: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్

ఇక హరిణి గాయని (Singer) మాత్రమే కాదు..డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, క్లాసికల్‌ డ్యాన్సర్‌ కూడా. తమిళం, తెలుగు, కన్నడ, మళయాలం, హిందీ సినిమాల్లో 3500కు పైగా పాటలు పాడారు. ఈమె మరో సింగర్‌ టిప్పును వివాహామాడారు. తెలుగులో మురారి, గుండుంబా శంకర్‌, ఘర్షణ, అల్లుడు శీను, నేను మీకు తెలుసా, సైనికుడు, 100% లవ్‌, లెజెండ్‌, స్పైడర్‌, నిశ్శబ్దం తదితర సినిమాలలో హరిణి (Harini) పాటలు పాడారు.

Also Read : UP: కటింగ్ చేయలేదని బార్బర్​ను కాల్చి చంపాడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News