Venkatalachimi Update: ప్రముఖ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన 'వెంకటలచ్చిమి' సినిమా ఘనంగా ప్రారంభమైంది. డైరెక్టర్ ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతుంది. సినిమా ప్రారంభోత్సవం హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో జరిగింది.
ఈ సినిమా 6 భాషల్లో విడుదల అవుతుంది – తెలుగు, హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం. ‘వెంకటలచ్చిమి’ ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీగా రూపొందించబోతున్నామని తెలియజేశారు సినిమా యూనిట్. డైరెక్టర్ ముని మాట్లాడుతూ, ఈ కథకు పాయల్ రాజ్‌పుత్ పాత్ర కరెక్ట్ గా సరిపోతుందని చెప్పారు. ఇది భారతీయ సినీ పరిశ్రమలో సంచలనాలు సృష్టించడమే కాక, అన్ని భాషలలో పెద్ద విజయం సాధించనుందని అభిప్రాయపడ్డారు.
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ, “మంగళవారం సినిమా తర్వాత ఎన్నో కథలు విన్నాను. కానీ ‘వెంకటలచ్చిమి’ కథ నాకెంతో నచ్చింది. ఈ సినిమా తర్వాత నా పేరు ‘వెంకటలచ్చిమి’గా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. ఇది నా కెరీర్‌కు కొత్త ఒరవడి ఇచ్చే ప్రాజెక్ట్” అని అన్నారు.
ఇటీవల యూత్ మధ్య హాట్ ఫేవరేట్ హీరోయిన్‌గా మారిన పాయల్ రాజ్‌పుత్, ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో డిఫరెంట్ కాన్సెప్టు ఛాలెంజింగ్ రోల్‌తో నటిస్తున్నారు. ఈ సినిమాతో ఆమె నటనా ప్రావీణ్యం మరో దశలోకి వెళ్లిపోతుందన్న విశ్వాసం ప్రేక్షకుల్లో తప్పక వస్తుంది అని కూడా చెప్పారు.
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. ఈ సినిమాకి ముని అందిస్తుండగా..రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
కాగా పాయల్ ఈమధ్య నటించిన మంగళవారం సినిమా ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఈ క్రమంలో పాయల్ పాన్ ఇండియా హీరోయిన్గా మారింది. ఇప్పుడు అదే తరహాలో ఈ సినిమా కూడా ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటుంది అని ఆమె అభిమానులు.. నమ్మకంతో ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.
Also Read: Amazon Investment: మరో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు.. అమెజాన్ అడ్డాాగా తెలంగాణ
Also Read: PRC And DAs: వేతన సవరణ సంఘం, డీఏల కోసం ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.