Bheemla Nayak OTT: 'భీమ్లా నాయక్' ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

Bheemla Nayak OTT: పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన 'భీమ్లా నాయక్' సినిమా  ఏప్రిల్ చివరి వారంలో ఓటిటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2022, 05:36 PM IST
  • ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్‌ విడుదల
  • ఫిబ్రవరి 21న ప్రిరిలీజ్‌ ఈవెంట్‌
  • ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Bheemla Nayak OTT: 'భీమ్లా నాయక్' ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

Bheema Nayak Movie to release OTT on April last week: 'వకీల్‌సాబ్‌'తో సూపర్ హిట్‌ కొట్టిన పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. తాజాగా నటించిన సినిమా 'భీమ్లా నాయక్‌'. సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా మయాళ హిట్ చిత్రం 'అయ్యప్పన్ కోషియమ్‌'కు రీమేక్‌ అన్న విషయం తెలిసిందే. పవన్, రానా దగ్గుబాటి కలిసి నటించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో నిత్యా మీనన్‌, సంయుక్త మీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి బరిలో ఉన్న భీమ్లా నాయక్‌ పలు కారణాలతో ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధంగా ఉంది.

ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్‌ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీ కానుంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమా శాటిలైట్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓటిటీ హక్కుల కోసం స్టార్ మా బాగానే చెల్లిస్తుందట. అయితే భీమ్లా నాయక్‌ సినిమా రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత ఓటిటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ అగ్రిమెంట్ చేసుకున్నారట. అంటే.. ఏప్రిల్ చివరి వారంలో ఓటిటీలో రిలీజ్ కానుంది.

భీమ్లా నాయక్‌ సినిమా షూటింగ్‌ గురువారం పూర్తయింది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో.. పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా తెలుస్తోన్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 21న భీమ్లా నాయక్‌ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ మెగా ఈవెంట్‌ను యూసుఫ్‌ గూడలోని పోలీస్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈవెంట్‌ వేదికపై ఓ క్లారిటీ రానుంది.

Also Read: AP Highways: 31 జాతీయ రహదారులకు శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ!!

Also Read: Suresh Raina: ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌లో సురేష్ రైనా అమ్ముడుకాకపోవడానికి కారణాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News