Gamanam Movie: ‘గమనం’ ట్రైలర్‌ విడుదల చేసిన పవన్ కల్యాణ్

‘గమనం’ (Gamanam) సినిమా ట్రైలర్‌ను పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విడుదల చేశారు. సుజనారావు దర్శకత్వంలో.. ఐదు భాషల్లో తెరకెక్కిస్తున్న గమనం.. తెలుగు వర్షన్ ట్రైలర్‌ను బుధవారం పవన్ కల్యాణ్ రిలీజ్ చేశారు.

Last Updated : Nov 12, 2020, 10:06 AM IST
Gamanam Movie: ‘గమనం’ ట్రైలర్‌ విడుదల చేసిన పవన్ కల్యాణ్

Pawan Kalyan released Gamanam Movie trailer: ‘గమనం’ (Gamanam) సినిమా ట్రైలర్‌ను పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విడుదల చేశారు. సుజనారావు దర్శకత్వంలో.. ఐదు భాషల్లో తెరకెక్కిస్తున్న గమనం.. తెలుగు వర్షన్ ట్రైలర్‌ను బుధవారం పవన్ కల్యాణ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గమనం ట్రైలర్‌ చలా సృజనాత్మకంగా, ఆకట్టుకునేలా ఉందని పేర్కొన్నారు. నిజజీవిత కథాంశం ఆధారంగా.. తొలిసారి సుజనారావు దర్శకత్వం వహించి.. చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ట్రైలర్ (Gamanam Movie trailer) చాలా ఆసక్తికరంగా ఉందని.. సినిమాను కూడా అందరూ ఆదరించాలని ఆయన పేర్కొన్నారు. Also read: Kajal, Gautam honeymoon pics: హనీమూన్‌‌లో కొత్త జంట.. కాజల్, కిచ్లు

gamanam

అయితే గమనం తెలుగు వర్షన్ ట్రైలర్‌ను పవన్‌కల్యాణ్‌ విడుదల చేయగా.. హిందీలో సోనూ సూద్ (Sonu Sood)‌, మలయాళంలో ఫహాద్‌ ఫాజిల్‌, కన్నడలో శివకుమార్‌, తమిళంలో జయం రవి విడుదల చేశారు. అయితే ఈ గమనం చిత్రంలో శ్రియ, శివ కందుకూరి, ప్రియాంకా జవాల్కర్‌, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రియ ఈ చిత్రంలో మూగ పాత్రలో నటించనుంది. Also read: Adah Sharma: అందంతో ఆకట్టుకుంటున్న ఆదా..

మూడు సాధారణ కథల ఆధారంగా మధ్యతరగతి కుటుంబాల పరిస్థితులను ఈ చిత్రంలో చూపించనున్నారు దర్శకురాలు సుజనారావు. ఈ చిత్రాన్ని వి.ఎస్‌. జ్ఞానశేఖర్‌, వెంకీ పుషడపు, రమేశ్‌ కరుటూరి నిర్మిస్తుండగా.. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా (Ilaiyaraaja) సంగీతాన్ని అందిస్తున్నారు. Also read: Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోస్తున్న రష్మీ..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe  

Trending News