ఒకే సినిమాకు కలిసి పనిచేయనున్న పవన్, నాని, చైతూ

నాగచైతన్య, నాని, పవన్ కల్యాణ్ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్టు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే, ఆ ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు కదా అని ఈ సినిమాను మల్టీస్టారర్ అని అనుకోకూడదట. ఎందుకంటే ఈ సినిమాలో లీడ్ హీరో చైతూనేనట. 

Last Updated : May 2, 2020, 12:15 AM IST
ఒకే సినిమాకు కలిసి పనిచేయనున్న పవన్, నాని, చైతూ

నాగచైతన్య, నాని, పవన్ కల్యాణ్ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్టు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే, ఆ ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు కదా అని ఈ సినిమాను మల్టీస్టారర్ అని అనుకోకూడదట. ఎందుకంటే ఈ సినిమాలో లీడ్ హీరో చైతూనేనట. ఇక పవన్ కల్యాణ్, నానిల విషయానికొస్తే.. ఆ ఇద్దరూ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. అవును, నాని నిర్మాతగా నిర్మించనున్న ఈ సినిమాను పవన్ కల్యాణ్ తన పీకే క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ప్రజెంట్ చేయనున్నట్టు ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్, నానిలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాల్పంచుకోనున్నట్టు తెలుస్తోంది.

Also read : అప్పటివరకు విమానాలు, రైల్వే, మెట్రో సేవలు రద్దు

సంతోషం, Mr పర్‌ఫెక్ట్, గ్రీకువీరుడు చిత్రాల ఫేమ్ దశరథ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడట. 2016లో వచ్చిన శౌర్య తర్వాత దశరధ్ డైరెక్ట్ చేయనున్న చిత్రం ఇదే కానుంది. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన టాక్ ఫిలింనగర్ కే పరిమితమైనప్పటికీ.. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానుందనేదే ఆ ప్రచారం సారాంశం.  

Also read: Breaking: మే 17 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన కేంద్రం

సంతోషం, మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రాలను పక్కనబెడితే.. హిట్టుకు నోచుకోని సంబరం, శ్రీ, స్వాగతం, శౌర్య లాంటి చిత్రాలను తెరకెక్కించిన దశరధ్ లాంటి దర్శకుడి కోసం నాని, పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు చిత్రాన్ని నిర్మించడానికి ఎందుకు ముందుకొస్తున్నారనే సందేహాలు వ్యక్తంచేసేవాళ్లూ లేకపోలేదు. ఇక చైతూ ప్రజెంట్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తోన్న లవ్ స్టోరీలో చైతూ నటిస్తుండగా, అతడి సరసన సాయి పల్లవి జంటగా నటిస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News