Pawan Kalyan - Hari Hara Veera Mallu OTT Partner: పవన్ కళ్యాణ్‌ 'హరిహర వీరమల్లు' ఓటిటి పార్ట్‌నర్ లాక్‌'..

Pawan Kalyan - Hari Hara Veera Mallu OTT Partner: పవన్ కళ్యాణ్‌ చేతిలో ప్రస్తుతం మూడు నాలుగు చిత్రాలున్నాయి. అందులో క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ దాదాపు ఐదేళ్లు కావొస్తోంది. కానీ ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ కొలిక్కి రావడం లేదు. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా డిజిటల్ ఓటీటీ ఫ్లాట్‌పామ్ పార్టనర్ లాక్ అయింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 19, 2024, 12:44 PM IST
Pawan Kalyan - Hari Hara Veera Mallu OTT Partner: పవన్ కళ్యాణ్‌ 'హరిహర వీరమల్లు' ఓటిటి పార్ట్‌నర్ లాక్‌'..

Pawan Kalyan - Hari Hara Veera Mallu OTT Partner: ప్రస్తుతం ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నుంచి సినిమాల నుంచి ఎలాంటి అప్‌డేట్స్ ఉండటం లేదు. తాజాగా ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్‌' మూవీపై చిత్ర యూనిట్ మరికాసేట్లో ప్రకటన చేయనుంది. ఏపీ సహా దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో అసెంబ్లీతో పాటు లోక్‌సభకు మే 13న ఎన్నికల జరగనున్నాయి. అది కూడా 4వ విడతలో ఎన్నికల నిర్వహించబోతున్నట్టు ఈసీ ప్రకటించింది. ఇక అదే రోజున తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ తన రాజకీయ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంత బిజీ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్‌ నుంచి సినిమాలు ఆశించడం భంగపాటే అవుతోంది. పవన్ కళ్యాణ్‌ గతేడాది 'బ్రో' మూవీతో పలకిరించాడు. మరోవైపు క్రిష్‌ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఒక అడుగు ముందుకు వేస్తే.. ఆరడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. ఈ సినిమాను దీపావళి నాటికి షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు.

ఈ సినిమా ఓటీటీ పార్టనర్ లాక్ అయింది. ఈ సినిమా 4 భాషలకు సంబంధించిన దాదాపు రూ. 60 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇక శాటిలైట్ హక్కులు కూడా అమ్ముడుపోయాయి. మరోవైపు సుజిత్ దర్శకత్వంలో  'ఓజీ' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీటైంది. ఈ సినిమాను ఈ యేడాది సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్‌ వెంటనే ఈ సినిమాల షూటింగ్స్‌ను కంప్లీట్ చేయనున్నాడు.

మరోవైపు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్‌ శంకర్ దర్శకత్వంలో  'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై మరికాసేట్లో బిగ్‌ అప్‌డేట్ ఇవ్వనున్నారు.

Also Read: Kavitha: కవిత అరెస్ట్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఘాటెక్కిన రాజకీయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News