Bheemla Nayak Success Party: భీమ్లా నాయక్ టీమ్‌కి పవన్ సక్సెస్ పార్టీ.. వీడియో వైరల్

Bheemla Nayak Success Party: భీమ్లా నాయక్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న పవన్ కల్యాణ్.. ఆ చిత్ర యూనిట్‌కి గ్రాండ్ పార్టీ ఇచ్చారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2022, 07:09 PM IST
  • భీమ్లా నాయక్ టీమ్‌కి పవన్ గ్రాండ్ పార్టీ
  • ఫిలింనగర్‌లో పార్టీ ఇచ్చిన పవన్ కల్యాణ్
  • బాక్సాఫీస్ వద్ద భీమ్లా నాయక్ వసూళ్ల వర్షం
Bheemla Nayak Success Party: భీమ్లా నాయక్ టీమ్‌కి పవన్ సక్సెస్ పార్టీ.. వీడియో వైరల్

Bheemla Nayak Success Party: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'భీమ్లా నాయక్' సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నెల 25న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌ టాక్‌ని సొంతం చేసుకుని దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్ టీమ్‌కి పవన్ కల్యాణ్ గ్రాండ్ పార్టీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

హైదరాబాద్ ఫిలింనగర్‌లో శనివారం (ఫిబ్రవరి 26) రాత్రి ఈ పార్టీ ఇచ్చినట్లు చెబుతున్నారు. టీమ్ సభ్యులంతా కలిసి టపాసులు కాల్చి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పార్టీలో పవన్ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో కనిపించారు. దర్శకుడు త్రివిక్రమ్ ఫుల్ హ్యాండ్ టీషర్ట్, జీన్స్‌లో కనిపించారు. పవన్ అక్కడ అడుగుపెట్టగానే చిచ్చు బుడ్లు పేల్చి స్వాగతం పలికారు. త్రివిక్రమ్ పవన్‌ని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ పార్టీకి భీమ్లా నాయక్ టీమ్‌తో పాటు పవన్ సన్నిహితులు కొందరు హాజరైనట్లు తెలుస్తోంది.

ఇక వసూళ్ల పరంగా భీమ్లా నాయక్ దుమ్ము రేపుతోంది. తొలి రెండు రోజుల్లో రూ.83 కోట్లు వరకు గ్రాస్ వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఇదే జోరు కొనసాగితే సోమవారం (ఫిబ్రవరి 28) నాటికి ఈ సినిమా రూ.100 కోట్లు వసూళ్లు చేయడం ఖాయమంటున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం, త్రివిక్రమ్ మాటలు, తమన్ సంగీతం అందించిన ఈ సినిమా సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్, రానా, నిత్యా మీనన్ పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. పవన్ డైలాగ్స్, రానా విలనిజం సినిమాకి హైలైట్‌ అని చెప్పొచ్చు. భీమ్లా నాయక్ హిట్‌తో అటు నిర్మాతలు, ఇటు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. 

Also Read: Budget Smart Phones: రూ.8 వేల లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్... పూర్తి వివరాలివే... 

Also Read: Russia Ukraine War: యూనివర్సిటీ బంకర్‌లో తలదాచుకున్న భారతీయ విద్యార్థిని.. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News