Pawan Kalyan Birthday: అప్పుడు ఇప్పుడు సేమ్ టు సేమ్.. రికార్డులు తిరగరాస్తోన్న 'జల్సా' రీ రిలీజ్‌!

Pawan Kalyan Birthday, Pawan Kalyans Jalsa Movie Record. 'పవర్ స్టార్‌' పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాని రి-రిలీజ్ చేసినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 2, 2022, 12:21 PM IST
  • అప్పుడు ఇప్పుడు సేమ్ టు సేమ్
  • రికార్డులు తిరగరాస్తోన్న 'జల్సా' రీ రిలీజ్‌
  • నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే
Pawan Kalyan Birthday: అప్పుడు ఇప్పుడు సేమ్ టు సేమ్.. రికార్డులు తిరగరాస్తోన్న 'జల్సా' రీ రిలీజ్‌!

Power Star Pawan Kalyans Jalsa Movie sets New Record in Re-Release also: 'పవర్ స్టార్‌' పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ సినిమా 'జల్సా'. 2008 ఏప్రిల్‌ 2న  విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసింది. అప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులు అన్ని బద్దలు అయిపోయాయి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కూడా జల్సా సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని అనుకొని ఉండరు. జల్సా చిత్రం పవర్ స్టార్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. పవన్ ఫాన్స్ అయితే పండగ చేసుకున్నారు. 

నేడు (సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ బర్త్ డే. పవర్ స్టార్‌ పుట్టినరోజు కాబట్టి సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతోంది. ఫాన్స్, ప్రముఖులు, నటినటీమణులు పవన్‌కు బర్త్ డే విషెష్ తెలుపుతున్నారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ గత హిట్ సినిమాలను థియేటర్లలో ప్రదర్శించారు. అందులో జల్సా సినిమా కూడా ఉంది. జల్సా సినిమాని రి-రిలీజ్ చేసినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. 2008 ఏప్రిల్‌ 2న జల్సా సినిమా విడుదలైన సమయంలో ఎలాంటి సందడి నెలకొందో.. మళ్లీ విడుదలైన సమయంలోనూ అదే సందడి నెలకొంది. 

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ 'జల్సా' 4కే వెర్షన్‌ను విడుదల చేశారు. ఫాన్స్ అందరూ థియేటర్లకు క్యూ కడుతున్నారు. దాంతో 'పవర్ స్టార్‌' పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 14 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదలైన ఈ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. భారత సినీ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానీ అరుదైన రికార్డను సొంతం చేసుకుంది. ఏకంగా 600కిపైగా స్పెషల్‌ షోస్‌తో జల్సా ట్రెండ్‌ సెట్‌ చేసింది.

Also Read: తొడకొట్టాడు తెలుగోడు.. అభిమానులకు పండగే పో! గూస్‌బంప్స్ తెస్తోన్న 'పవర్ గ్లాన్స్'

Also Read: Pawan Kalyan Unknown Facts: విలక్షణమైన వ్యక్తిత్వం, జనం కోసం పుట్టిన హీరో.. పవన్ కళ్యాణ్ గురించి మీకు తెలియని మరిన్ని విషయాలివే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News