Pawan Kalyan in F3: అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. ఎఫ్3 సినిమాలో పవన్ కళ్యాణ్!

Is Pawan Kalyan acted in F3 Movie. టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఎఫ్‌ 3 సినిమాలో కనిపించనున్నారట.

Written by - ZH Telugu Desk | Last Updated : May 26, 2022, 06:02 PM IST
  • మే 27న 'ఎఫ్‌ 3' విడుద‌ల
  • సినీ అభిమానులకు శుభవార్త
  • ఎఫ్3 సినిమాలో పవన్ కళ్యాణ్
Pawan Kalyan in F3: అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. ఎఫ్3 సినిమాలో పవన్ కళ్యాణ్!

Is Pawan Kalyan acted in F3 Movie: ఫామిలీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన సినిమా 'ఎఫ్‌ 3'. శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించారు. గ్లామర్ క్వీన్స్ తమన్నా భాటియా, మెహ్రీన్ ఫిర్జాదా కథానాయికలు. 2019లో సంక్రాంతి కానుక‌గా విడుద‌లై భారీ విజ‌యాన్ని అందుకున్న ఎఫ్‌ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్‌ 3 తెర‌కెక్కింది. ఎఫ్ 2కి మించిన వినోదం ఎఫ్ 3లో ఉంటుందని టీజర్, ట్రైలర్ చూస్తే ఇట్టే అర్ధమవుతోంది. శుక్రవారం (మే 27) ఎఫ్‌ 3 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరికొన్ని గంటల్లో 'ఎఫ్‌ 3' సినిమా విడుదల అవనున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఎఫ్‌ 3 సినిమాలో కనిపించనున్నారట. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత దిల్ రాజు స్వయంగా వెల్లడించడం విశేషం. 'అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఉంది. ఎఫ్‌ 3 సినిమాలో స్క్రీన్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. నిజమే చెపుతున్నా..సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది' అని అన్నారు. 

అయితే 'ఎఫ్‌ 3' సినిమాలో పవన్ కళ్యాణ్ స్వయంగా నటించారా? లేదా ఆయనకు సంబంధించిన ఏమైనా పోస్టర్ వాడారా? అన్నది తెలియాల్సి ఉంది. వెంకటేష్, పవన్ కళ్యాణ్ కాంబోలో 'గోపాల గోపాల' సినిమా వచ్చిన విషయం తెలిసిందే. వెంకీ, పవన్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. దాంతో ఎఫ్ 3లో పవన్ కనిపించే అవకాశం లేకపోలేదు. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే.. మరి కొన్ని గంటలు ఆగాల్సిందే. 

'ఎఫ్‌ 3' చిత్రంలో ఇప్పటికే భారీ తారాగణం ఉంది. వెంకటేష్, వ‌రుణ్‌ తేజ్, త‌మ‌న్నా, మెహ‌రిన్‌, సునీల్, సోనాల్‌ చౌహ‌న్‌లు నటిస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా నటిస్తే.. అభిమానులకు కనుల పండగే. ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దాంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఎఫ్ 3 టిక్కెట్ రేట్లు పెంచడం లేదని, ప్రభుత్వం నిర్ణయించిన రేట్లతోనే కుటుంబంతో కలిసి హ్యాపీగా సినిమా చూడండని నిర్మాత దిల్‌ రాజు ఇప్పటికే ప్రకటించారు. 

Also Read: Snake Viral Video: నదిలో ఈత కొడుతున్న యువకుడిని వెంటాడిన పాము.. చివరకు ఏమైందంటే?

Also Read: CM Kcr comments: త్వరలో సంచలనాలు..బెంగళూరులో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News