Pawan Kalyan birthday: ఫ్యాన్స్ తన బర్త్ డే జరుపుకోవడం గురించి పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

Pawan Kalyan birthday celebrations: పవన్ కల్యాణ్ బర్త్ డే అంటే పవన్ అభిమానులకు పండగలాంటి రోజు. తమ అభిమాన నటుడు, నాయకుడు పుట్టిన రోజును పవర్ స్టార్ అభిమానులు ఓ పండగలా, వేడుకలా సెలబ్రేట్ చేసుకుంటారు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజును ( Pawan Kalyan's birthday ) పురస్కరించుకుని ఆయన అభిమానులు జరుపుతున్న సేవా కార్యక్రమాలపై స్వయంగా పవన్ కల్యాణ్ స్పందించారు.

Last Updated : Sep 2, 2020, 01:25 AM IST
  • పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకల్లో భాగంగా అనేక సేవా కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్.
  • తన అభిమానులు తన పుట్టిన రోజును వారి పుట్టిన రోజులా సెలబ్రేట్ చేసుకోవడంపై స్పందించిన పవన్ కల్యాణ్.
  • ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిమానుల గురించి, తన పుట్టిన రోజు వేడుకల గురించి పలు ఆసక్తికరమైన అంశాలు పంచుకున్న పవర్ స్టార్.
Pawan Kalyan birthday: ఫ్యాన్స్ తన బర్త్ డే జరుపుకోవడం గురించి పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

Pawan Kalyan birthday celebrations: పవన్ కల్యాణ్ బర్త్ డే అంటే పవన్ అభిమానులకు పండగలాంటి రోజు. తమ అభిమాన నటుడు, నాయకుడు పుట్టిన రోజును పవర్ స్టార్ అభిమానులు ఓ పండగలా, వేడుకలా సెలబ్రేట్ చేసుకుంటారు. అలా సెలబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు నిర్వహించే క్రమంలోనే చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన ఓ అనుకోని ప్రమాదంలో పవన్ కల్యాణ్ అభిమానులు ఫ్లెక్సీలు కడుతుండగా ముగ్గురు అభిమానులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. Also read : పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో తీవ్ర అపశృతి.. ముగ్గురు అభిమానులు మృతి

కుప్పంలో జరిగిన ఈ దుర్ఘటన సంగతి ఎలా ఉన్నా.. ఇంకెంతో మంది పవన్ కల్యాణ్ అభిమానులు ఆయన పుట్టిన రోజు నాడు తమకు తోచిన రీతిలో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. కోవిడ్-19 చికిత్స ( COVID-19 treatment ) అందిస్తున్న ఆస్పత్రులకు ఆక్సీజన్ సిలిండర్లు అందించడం, కరోనాతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న బాధితులకు నిత్యావసర సరుకులు అందించడం, రక్తదాన శిబిరాలు ( Blood donations drives ) నిర్వహించడం వంటివి ఇందులో కొన్ని సేవా కార్యక్రమాలుగా పవన్ అభిమానులు చెబుతున్నారు. Also read : COVID-19: కరోనాతో తెలంగాణ మాజీ మంత్రి మృతి

పవన్ కల్యాణ్ పుట్టిన రోజును ( Pawan Kalyan's birthday ) పురస్కరించుకుని ఆయన అభిమానులు జరుపుతున్న సేవా కార్యక్రమాలపై స్వయంగా పవన్ కల్యాణ్ స్పందించారు. తన అభిమానులు తన పుట్టిన రోజును వేడుకలా జరుపుకునే భాగ్యం కలగడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పిన పవన్ కల్యాణ్.. ఇదంతా తన ప్రమేయం లేకుండానే జరుగుతోందని అన్నారు. కుప్పంలో దుర్ఘటన జరగడానికి ముందే ఓ యూట్యూబ్ ఛానెల్ ద్వారా నాలుగున్నర నిమిషాల నిడివిగల ఓ చిన్న వీడియోను ( Pawan Kalyan birthday interview video ) విడుదల చేసిన పవన్ కల్యాణ్.. ఆ వీడియోలో ఈ విషయాలు చెప్పుకొచ్చారు. Also read : COVID-19 AP: ఏపీలో 4 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య

ఇదిలావుంటే, దురదృష్టవశాత్తుగా ఎవ్వరూ ఊహించని విధంగా కుప్పంలో ముగ్గురు అభిమానులు మృతి చెందిన తీరు తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు ( Pawan Kalyan fans death ). చనిపోయిన జనసైనికుల కుటుంబాలకు తాను అన్నివిధాల అండగా ఉంటానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. Also read : CSK in IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్‌కి భారీ ఊరట

Trending News