Shehzada vs Pathaan: 'అల' రీమేక్ కు దిమ్మతిరిగే షాక్.. దెబ్బకు ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ ఆఫర్!

Shehzada vs Pathaan: తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన అలా వైకుంఠపురంలో సినిమాను కూడా హిందీలో షహజాదా పేరుతో రీమేక్ చేయగా అది ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది, అయితే ఈ సినిమాకు పఠాన్ మేకర్స్ పెద్ద షాకిచ్చారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 17, 2023, 10:48 AM IST
Shehzada vs Pathaan: 'అల' రీమేక్ కు దిమ్మతిరిగే షాక్.. దెబ్బకు ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ ఆఫర్!

Pathaan Masterstroke to shehzada: ఇప్పుడంటే తెలుగులో తెరకెక్కుతున్న సినిమాలను తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా ఏకకాలంలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కానీ కొన్నాళ్ల క్రితం వచ్చిన తెలుగు సినిమాల రీమేక్ హక్కులు కొనుక్కుని హిందీ సహా ఇతర భాషల దర్శకనిర్మాతలు అక్కడ రీమేక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఇక్కడ సూపర్ హిట్లుగా నిలిచిన జెర్సీ, హిట్ వంటి సినిమాలను హిందీలో రీమేక్ చేస్తే దారుణమైన ఫలితాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇక ఇప్పుడు తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన అలా వైకుంఠపురంలో సినిమాను కూడా హిందీలో షహజాదా పేరుతో రీమేక్ చేశారు. ఈ రోజు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే గత నెలలో విడుదలైన పఠాన్ సినిమాలు వసూళ్ల జోరు ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటికే భారత దేశంలో 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఆ సినిమా ఇంకా జోరు చూపిస్తూ ముందుకు సాగుతోంది. ఈ దెబ్బకు షహజాదా సినిమా రిలీజ్ అయితే కొంతమేర దానికి వసూళ్లు దానికి డైవర్ట్ అయ్యే అవకాశం ఉందని అనుకున్నారు.

అయితే పఠాన్ సినిమాను రిలీజ్ చేసిన యశ్రాజ్ ఫిలింస్ సంస్థ భారీ దెబ్బేసింది. అదేమిటంటే తమకు భారత దేశంలో ఇంత ఆదరణ చూపించినందుకు గాను శుక్రవారం నాడు పఠాన్ సినిమాను నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ అంటే ఐనాక్స్ సహా పివిఆర్ వంటి థియేటర్లలో కేవలం 112 రూపాయలకే సినిమా చూడవచ్చు అంటూ ఆఫర్ ప్రకటించింది. అయతే అది ప్రేక్షకులను ఆకట్టుకునే స్కీం కాదని లేదా ప్రేక్షకులకు వారిచ్చే గిఫ్ట్ కాదని షహజాదా సినిమా వైపు ప్రేక్షకులు మళ్లకుండా చేసే ప్లాన్ అని అంటున్నారు. ఇక యాష్ రాజ్ ఫిలింస్ తో దెబ్బకు షహజాదా మేకర్స్ కూడా ఆలోచనలో పడ్డారు.

వెంటనే ఈ సినిమాని కూడా బుక్ మై షోలో ఒక టికెట్ ఉంటే మరో టికెట్ ఫ్రీ అంటూ ఒక ఆఫర్ ప్రకటించారు. భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ షహజాదా సినిమా చూడాలన్నా బుక్ మై షో లో ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అన్నట్లుగా ఆఫర్ ప్రకటించారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాని తెలుగులో అలవైకుంఠపురం సినిమా తెరకెక్కించిన అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ చినబాబు హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లు హిందీలో సమర్పించడమే. గతంలో ఇలా చేసిన సినిమాలు ఏవీ తెలుగు నిర్మాతలకు కలిసి రాలేదు. ఇప్పుడు కూడా ఈ సినిమా బుకింగ్స్ లో వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించడంతో ఇది కూడా దెబ్బ వేసే లాగానే ఉందని అంటున్నారు.

Also Read: Dhanush Silent Craze: ధనుష్ కి తెలుగులో ఏమన్నా క్రేజ్ ఉందా..అన్ని షోస్ హౌస్ ఫుల్లే!

Also Read: Sir Movie Review: ధనుష్ పాస్ అయ్యాడా? 'సార్' రివ్యూ అండ్ రేటింగ్ మీకోసం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News