Radhe Shyam: హస్త సాముద్రికుడు..కానీ ఎప్పుడూ ఎవరి ముందూ చేయి చూపించలేదు

Radhe Shyam: ప్రభాస్. బాహుబలిగా సుపరిచితమై..పాన్ ఇండియా హీరోగా బిజీగా మారిన తెలుగు నటుడు. ప్రేక్షకులకు వైవిద్యాన్ని చూపిస్తానని..బోర్ కొట్టించనని చెబుతున్నాడు. రాధేశ్యామ్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్న ప్రభాస్..ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 2, 2022, 07:22 PM IST
Radhe Shyam: హస్త సాముద్రికుడు..కానీ ఎప్పుడూ ఎవరి ముందూ చేయి చూపించలేదు

Radhe Shyam: ప్రభాస్. బాహుబలిగా సుపరిచితమై..పాన్ ఇండియా హీరోగా బిజీగా మారిన తెలుగు నటుడు. ప్రేక్షకులకు వైవిద్యాన్ని చూపిస్తానని..బోర్ కొట్టించనని చెబుతున్నాడు. రాధేశ్యామ్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్న ప్రభాస్..ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ప్రభాస్, పూజాహెగ్డేలు నటించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ ఈ ఏడాది అత్యధిక అంచనాలున్న సినిమాగా మార్చ్ 11న విడుదల కానుంది. హస్తసాముద్రికుడి పాత్ర పోషిస్తున్న ప్రభాస్ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో హస్త సాముద్రికుడి పాత్ర పోషిస్తున్నా..నిజ జీవితంలో మాత్రం ఇప్పటివరకూ ఎప్పుడూ ఏ జ్యోతిషుడి ముందు చేయి చూపించుకోకపోవడం విశేషం. ఆ అవసరం రాదని అంటున్నాడు. తన వరకూ తాను ఎప్పుడూ అదృష్టం, విధి రాతనే నమ్ముతానంటున్నాడు. రాధేశ్యామ్ సినిమాలో హస్త సాముద్రికుడి పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయానని..ఆసక్తిగా ఏర్పడిందని చెప్పాడు. 

బాహుబలి సినిమాతో కెరీర్‌లో పీక్స్‌కు వెళ్లిన ప్రభాస్..సాహో యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. బాహుబలి, సాహో సినిమాలతో సినీ పరిశ్రమలో ప్రభాస్ యాక్షన్ హీరోగా ప్రాచుర్యం పొందాడు. విభిన్నమైన పాత్రతో రాధేశ్యామ్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నా..ఈ సినిమాలో కూడా యాక్షన్ ఉండనే ఉంది. ఎందుకంటే సినిమా ఇతివృత్తమే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో యాక్షన్ ఉన్నా సరే..మిగిలిన సినిమాల్లా..ఫైట్స్ ఉండవన్నాడు ప్రభాస్. అదే సమయంలో ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలు మాత్రం యాక్షన్ మూవీలని చెప్పుకొచ్చాడు. టాలీవుడ్‌లో కూడా యాక్షన్ సినిమాలతో ప్రారంభించినా..డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ వంటి రొమాంటిక్ సినిమాలు చేశానన్నాడు. ప్రేక్షకులకు బోర్ కొట్టించడం తనకిష్టం లేదన్నాడు.

ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సినిమా..సినిమాలు పాన్ ఇండియాకు వెళ్లేందుకు మార్గం సుగమం చేశాయి. కేజీఎఫ్ , పుష్ప వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు సృష్టించాయి. ప్రస్తుతం చేతిలో ఐదు అతి పాన్ ఇండియా సినిమాలున్న ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే. అతని చేతిలో ఆదిపురుష్, రాధేశ్యామ్, సాలార్, స్పిరిట్, ప్రోజెక్ట్ కే సినిమాలున్నాయి. రానున్న ఐదేళ్లలో భారతీయ సినిమా ప్రపంచంలోనే అతిపెద్ద ఇండస్ట్రీగా మారనుందని ప్రభాస్ అంటున్నాడు. 

Also read: ET Telugu Official Trailer: సూర్య ET ట్రైలర్ రిలీజ్.. రాక్ సాలిడ్ గా ఉందన్న విజయ్ దేవరకొండ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News