Vijay Devarakonda Mother Video: మాది దొరల ఫ్యామిలీ..మేము దొరసానులమన్న విజయ్ తల్లి.. దారుణమైన ట్రోలింగ్!!

Vijay Devarakonda Mother Video: లైగర్ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ ట్రెండ్ చేస్తున్న కొందరు విజయ్ దేవరకొండ తల్లి పాత వీడియో తెర మీదకు తెచ్చారు. ఆ వివరాలు

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 23, 2022, 11:07 AM IST
Vijay Devarakonda Mother Video: మాది దొరల ఫ్యామిలీ..మేము దొరసానులమన్న విజయ్ తల్లి.. దారుణమైన ట్రోలింగ్!!

Vijay Devarakonda Mother Video: విజయ్ దేవరకొండ లైగర్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకే కాదు పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో రూపొందిన లైగర్ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. పూరీ కనెక్ట్స్ బ్యానర్ మీద చార్మి-పూరి జగన్నాథ్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కరణ్ జోహార్-అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు.

ఇక ఆగస్టు 25న సినిమా విడుదలవుతున్న క్రమంలో అనూహ్యంగా విజయ్ దేవరకొండ బాయ్ కాట్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా బాయ్ విషయాన్ని గురించి విజయ్ దేవరకొండ అని ఒక ఇంటర్వూలోప్రశ్నిస్తే విజయ్ దేవరకొండ అమీర్ ఖాన్ సినిమాకి మద్దతుగా కామెంట్స్ చేయడంతో బాలీవుడ్ బాయ్ కాట్ వర్గం అంతా ఇప్పుడు విజయ్ మీద ఫోకస్ చేసింది. బాలీవుడ్ బాయ్ కాట్ వర్గానికి అసలు నచ్చని కరణ్ జోహార్ తో కలిసి సినిమా చేయడం, ఆయన కాంపౌండ్ లోని హీరోయిన్ ను సినిమాలో తీసుకోవడం సహా అనేక కారణాలను ఎత్తి చూపుతూ వారంతా విజయ్ సినిమాను బ్యాన్ చేయాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాకుండా చాలా సిల్లీ రీజన్స్ తెర మీదకు తీసుకువచ్చి విజయ్ దేవరకొండ సినిమా బాయ్ కట్ చేయాలి అంటూ పిలుపునిస్తున్నారు. ఇక దానికి కారణాలు అని చెబుతూ విజయ్ దేవరకొండ మన తెలుగు ప్రెస్ మీట్ లో కాళ్లు టేబుల్ మీద పెట్టి మాట్లాడుతున్న ఫోటోలు షేర్ చేసి ఇంత గర్వం ఉన్న వాళ్ళ సినిమాను బాయ్ కాట్ Boycott Liger చేయాలని పిలుపునిస్తున్నారు అదేవిధంగా ఈ మధ్య విజయ్ దేవరకొండ తల్లి విజయ్ దేవరకొండ అనన్య పాండే ఇంటికి వచ్చిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా అప్పుడు అర్చకులు నిలబడితే విజయ్ దేవరకొండ కూర్చున్నారు అంటూ కూడా ఆ విషయంలో బాయ్ కట్ చేయాలని పిలుపునిస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రోలర్లకు మరో ఆయుధం దొరికింది.

అదేమంటే విజయ్ దేవరకొండ తల్లి గతంలో చేసిన కామెంట్లను ఇప్పుడు తెరమీదకు తీసుకువచ్చి ఆమెను కూడా ట్రోల్ చేస్తున్నారు. ఆమె గతంలో ఏదో సినిమా చూసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాము గడీలలో బతికే వాళ్ళమని, తమకు బురఖా పద్దతి ఉండేదని, తమది దొరల ఫ్యామిలీ అని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ తాము ఊరికి వెళితే తమ దగ్గర పాలేర్లుగా పనిచేసిన వారంతా తమని దొరల లాగేనే చూస్తారంటూ ఆమె కామెంట్స్ చేశారు. ఇక అందులో తప్పు పట్టాల్సిన అంశం ఏముందో అర్థం కావడం లేదు కానీ ఇలా ఇప్పటికీ దొరలమంటూ బతికే వాళ్లు ఉన్నారా అంటూ ట్రోలర్లు ఆమెను  టార్గెట్ చేస్తున్నారు. ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని అందుకే లైగర్ సినిమాని బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. అసలు ఇందులో ఏమాత్రం లాజిక్ లేదు కానీ ఈ బాయ్ కాట్ ట్రెండ్ లైగర్ సినిమాకు ఎంతవరకు నష్టం చేకూరుస్తుందో అనే టెన్షన్ అయితే సినిమా యూనిట్లో నెలకొంది.

Also Read: Megastar Chiranjeevi rare photos: మీరెప్పుడూ చూడని మెగాస్టార్ ఫోటోలు

Also Read: Megastar Chiranjeevi Upcoming Movies: వరుస సినిమాలు లైన్లో పెట్టిన చిరు.. లిస్టు చూసేద్దామా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News