NTR - Prashanth Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీపై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్..

NTR - Prashanth Neel: దేశ వ్యాప్తంగా అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో ఒకటి. ఎపుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా 'సలార్ -2' కారణంగా ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా ఎపుడు సెట్స్ పైకి వెళ్లే డేట్ ఫిక్స్ అయినట్టు సమాచారం.  

Written by - TA Kiran Kumar | Last Updated : May 2, 2024, 01:11 PM IST
NTR - Prashanth Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీపై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్..

NTR - Prashanth Neel:  RRR తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఆకాశమే హద్దుగా సాగిపోతుంది. ఈ సినిమా తర్వాత  ఎన్టీఆర్ చేయబోయే సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఎన్టీఆర్..కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. మొదటి పార్ట్ ఈ యేడాది అక్టోబర్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు ఎన్టీఆర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో 'వార్ 2' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు. నార్త్, సౌత్ కలయికలో వస్తోన్న భారీ మల్టీస్టారర్ మూవీపై దేశ వ్యాప్తంగా అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఈ సినిమాలో ఆలియా భట్, కియారా అద్వానీ హీరోయిన్స్‌గా నటించడం దాదాపు ఖాయమైంది.

మరోవైపు ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్‌తో చేయబోయే సినిమా ఎపుడో సెట్స్ పైకి వెళ్లాల్సింది. సలార్ 2 కారణంగా ఈ సినిమా ఆలస్యమైంది. ప్రశాంత్ నీల్ .. ఈ నెలాఖరు నుంచి  సలార్ 2 స్టార్ట్స్ చేసి ఆగష్టు వరకు కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే సలార్ పార్ట్ 2 సంబంధించిన షూటింగ్ కొంత భాగం పూర్తి చేసారు. ఇక సెప్టెంబర్ నుంచి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలైయ్యాయి. ఈ సినిమాను పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

ఇక ఎన్టీఆర్ నటిస్తోన్న 'దేవర' మూవీ విషయానికొస్తే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ మరోసారి మూడు విభిన్న పాత్రలతో అలరించనున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక 'దేవర' రెండో పార్ట్‌ను 2025 సమ్మర్‌లో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అటు 'వార్ 2' మూవీని 2025 రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అది కుదరకుంటే 2025 ఆగష్టు 15న విడుదలనే ఆలోచనలో ఉన్నారు.

మొత్తంగా తారక్.. ఎలాంటి ఈగోలకు పోకుండా తన తోటి స్టార్ హీరోలతో మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి  ముందుకు వస్తున్నాడు.  దీంతో పాటు మరో బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ భాగం కాబోతున్నట్టు సమాచారం. మరోవైపు అట్లీతో పాటు కల్కి ఫేమ్ నాగ్ అశ్విన్‌లతో కూడా ఎన్టీఆర్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది.

Also Read: Glass Symbol: ఏపీ ఎన్నికల్లో కూటమికి భారీ షాక్‌.. గాజు గ్లాస్‌ ఇతరులకు కేటాయింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News