Weekend Movies: ఈ వారం ఏకంగా 10 సినిమాల రిలీజ్‌, జోరు మీదున్న చిన్న సినిమాలు!

కొవిడ్‌ విజృంభణతో మొన్నటి వరకు సినిమాల జోరు పూర్తి తగ్గింది. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. ఈ వారం ఏకంగా పది సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. ఆ మూవీలు ఏమిటో ఒకసారి చూడండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2022, 03:57 PM IST
  • రిలీజ్‌కు సిద్ధం అవుతోన్న మూవీలు
  • వీకెండ్స్‌లలో మూవీల రిలీజ్‌ జోరు
  • ఈ వారం పలు సినిమాల రిలీజ్‌
  • మార్చిలో పలు పెద్ద సినిమాల విడుదల
Weekend Movies: ఈ వారం ఏకంగా 10 సినిమాల రిలీజ్‌, జోరు మీదున్న చిన్న సినిమాలు!

కొవిడ్ థర్డ్‌ వేవ్ వల్ల వాయిదా పడ్డ చాలా సినిమాలు ఇప్పుడు విడుదల అవుతున్నాయి. పెద్ద సినిమాలన్నీ చాలా వరకు పోస్ట్ పోన్ అయ్యాయి. సంక్రాంతి సందర్భంగా  కొన్ని చిన్న సినిమాలు బరిలోకి దిగాయి. ఇక అప్పటి నుంచి వరుసగా వీకెండ్స్‌లలో మూవీలు రిలీజ్‌ అవుతూ సందడి చేస్తున్నాయి. కొవిడ్ పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో చిన్న సినిమాల జోరు పెరిగింది. ఇక ఈ వారం కూడా పలు సినిమాలు రిలీజ్‌ కానున్నాయి. 

మార్చిలో ఎలాగో పలు పెద్ద సినిమాల రిలీజ్‌ ఉండడంతో.. చిన్న సినిమాలు అన్నింటినీ ఫిబ్రవరిలోనే రిలీజ్‌ చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఇక వచ్చే ఈ నెల 18వ తేదీన శుక్రవారం మొత్తం 10 సినిమాలు థియేటర్లలో రిలీజ్‌ కానున్నాయి. ఇందులో మోహన్ బాబు మూవీ సన్ ఆఫ్ ఇండియా కూడా ఉంది. 

నిర్మాత లగడపాటి శ్రీధర్ కొడుకు విక్రమ్ సహిదేవ్ హీరోగా పరిచయం అవుతోన్న మూవీ కూడా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్ సహిదేవ్ వర్జిన్ స్టోరీ ఫిబ్రవరి 18న రిలీజ్‌ కానుంది. సన్ ఆఫ్ ఇండియా, వర్జిన్ స్టోరీ మినహా మిగిలినవన్నీ చిన్న సినిమాలే. 

గత వారమే రిలీజ్‌ కావాల్సినటువంటి బ్యాచ్ 1 మూవీ కూడా ఈ శుక్రవారం విడుదల కానుంది. 2020 గోల్ మాల్, సురభి 70 ఎం.ఎం, విశ్వక్, రోమన్‌తో పాటు నీకు నాకు పెళ్ళంట మూవీలు ఈ వీకెండ్‌లో రిలీజ్‌ కానున్నాయి. 

అలాగే ఇంగ్లీష్​ డబ్బింగ్ మూవీ అన్ చార్టెడ్‌తో పాటు కన్నడ డబ్బింగ్ చిత్రం బడవ రాస్కెల్ మూవీలు కూడా రిలీజ్‌ కానున్నాయి. ఇక ఈ 10 సినిమాల్లో తమకు నచ్చిన మూవీలను చూసేందుకు ప్రేక్షకులు కూడా సిద్ధమవుతున్నారు. 

Also Read: Korean Girl Srivalli Dance: అల్లు అర్జున్ ను కాపీ కొట్టిన కొరియన్ బ్యూటీ- శ్రీవల్లీ డ్యాన్స్ వీడియో వైరల్

Also Read: Radhe Shyam: రాధే శ్యామ్​ నుంచి వాలెంటైన్స్ గిఫ్ట్​- ప్రభాస్, పూజాల లుక్స్ అదుర్స్​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Korean Womansrivalliallu arjunPushpaInstagram Reels

 

 

 

Trending News