Samantha Trolls : సమంతపై ట్రోల్స్, చైతూపై జాలి.. మగాళ్ల ప్రేమ అంతే!.. అసలు మ్యాటర్ ఏంటంటే?

Netizens Trolls Samantha సమంత మీద ప్రస్తుతం ట్రోలింగ్ జరుగుతోంది. సమంత నటిగా పదమూడేళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఏ మాయ చేశావే సినిమా గురించి పోస్ట్ చేస్తూ ఎక్కడా కూడా నాగ చైతన్య ఫోటోలను మాత్రం షేర్ చేయలేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2023, 09:19 AM IST
  • సమంత, చైతూలపై నెట్టింట్లో చర్చలు
  • సమంత చర్యలపై నెటిజన్ల ట్రోలింగ్
  • నాగ చైతన్య ప్రేమకు ఫిదా
Samantha Trolls : సమంతపై ట్రోల్స్, చైతూపై జాలి.. మగాళ్ల ప్రేమ అంతే!.. అసలు మ్యాటర్ ఏంటంటే?

Naga Chaitanya - Samantha ప్రస్తుతం సమంత, నాగ చైతన్యల మీద సోషల్ మీడియాలో చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏ మాయ చేశావే సినిమా వచ్చి పదమూడేళ్లు అవుతోంది. దీంతో నటిగా సమంతకు పదమూడేళ్లు నిండాయి. ఈ సినిమాను అటు చైతూకి, ఇటు సమంతకు స్పెషల్‌. ఈ మూవీతోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అదే చివరకు పెళ్లి వరకు దారి తీసింది. అయితే ఈ వివాహా బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. నాలుగేళ్ల వివాహా బంధం ముక్కలైంది. కరోనా టైంలోనే ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు విడివిడిగా ఉంటున్నారు.

విడాకుల వరకు వ్యవహారం ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. దానికి కారణం ఏమై ఉంటుందా? అనే విషయంపై నెటిజన్లు ఆరా తీస్తుంటారు. సమంత వల్లే విడాకులు అయ్యాయని కొందరు అంటుంటే.. నాగ చైతన్య ప్రవర్తన వల్లే విడాకుల వరకు వ్యవహారం వచ్చిందని మరి కొందరు అంటుంటారు. ఇక నాగ చైతన్య శోభిత దూళిపాళ్ల వ్యవహారం కూడా ఈ రూమర్లకు ఆజ్యం పోసింది.

సమంత మాత్రం నాగ చైతన్య పట్ల విపరీతమైన కోపం, ద్వేషాలతో రగిలిపోతోన్నట్టుగా కనిపిస్తోంది. ఆమె ఎక్కడా కూడా నాగ చైతన్య గురించి స్పందించేందుకు ఇష్టపడలేదు. కరణ్ జోహార్ పొరపాటున మీ భర్త అని అంటే.. భర్త కాదు.. మాజీ భర్త అని సమంత సరిచేసింది. తమ ఇద్దరినీ ఒకే రూంలో ఉంచితే.. అక్కడ చుట్టు పక్కలా కత్తులు లేకుండా చూసుకుంటే బెటర్ అన్నట్టుగా మాట్లాడింది. కానీ సమంత గురించి నాగ చైతన్య మాత్రం ఎప్పుడూ పాజిటివ్‌గానే మాట్లాడాడు.

సమంత ఎదురైతే హగ్ చేసుకుంటాను.. ఓ ఫ్రెండ్‌గానే చూస్తాను.. తామిద్దరం ఇప్పుడు కలిసి నటిస్తే అది క్రేజీగా ఉంటుందని ఇలా ఎంతో ఫ్రెండ్లీగా నాగ చైతన్య మాట్లాడాడు. ఏ మాయ చేశావే పదమూడేళ్లు పూర్తి చేసుకోవడంపైనా సమంతతో ఉన్న పోస్టర్‌ను షేర్ చేశాడు నాగ చైతన్య. కానీ సమంత మాత్రం చైతూ ఊసు లేకుండానే ఫోటోలను షేర్ చేసింది. దీంతో జనాలు సమంతను ట్రోల్ చేశారు. ఇంత పంతం, ద్వేషం ఎందుకు అని నిలదీస్తున్నారు.

ఈ రెండు పోస్టులను పోల్చుతూ సమంతను ట్రోల్ చేస్తున్నారు. మగాళ్ల ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుందని, మళ్లీరావా సినిమా డైలాగ్‌ను వాడేస్తున్నారు. నువ్ దగ్గరగా ఉన్నప్పుడు ఇష్టపడటం, దూరంగా ఉంటే బాధపడటం తప్పా నాకు ఇంకేం తెలియదు అని సుమంత్ చెప్పే డైలాగ్‌ను ఇప్పుడు చైతూకి అన్వయిస్తున్నారు.

Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?

Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News