Samantha's Shaakuntalam: సమంత ఆంటీ ఇంకా రెండు రోజులే ఉంది!.. సామ్ రిప్లై ఇదే!

Samantha's Shaakuntalam సమంత శాకుంతలం సినిమా గట్టెక్కడం చాలా కష్టంగానే కనిపిస్తోంది. ఈ సినిమా మీద ఏ మాత్రం కూడా బజ్ ఏర్పడటం లేదు. చివరకు త్రీడీ ఫార్మాట్లోకి మార్చి ట్రైలర్‌ను కొత్తగా కట్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2023, 12:46 PM IST
  • రెండ్రోజుల్లో సమంత సందడి
  • ఏప్రిల్ 14న థియేటర్లోకి శాకుంతలం
  • ఇప్పటికే బయటకు వచ్చిన నెగెటివ్ టాక్
Samantha's Shaakuntalam: సమంత ఆంటీ ఇంకా రెండు రోజులే ఉంది!.. సామ్ రిప్లై ఇదే!

Neeraja Kona Son Wishes Samantha's Shaakuntalam: సమంత శాకుంతలం సినిమాకు ఇప్పుడు కాస్త గడ్డుకాలం నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. గుణ శేఖర్, దిల్ రాజుకు తాము తీసిన సినిమా మీద నమ్మకం ఉండటంతో.. సినిమా రిలీజ్ కంటే నాలుగు రోజుల ముందే ఓ షోను వేశారు. తీరా సినిమా టాక్ తెలిసి అంతా షాక్ అయ్యారు. సినిమా ఏ మాత్రం బాగా లేదని టాక్ వినిపిస్తోంది. పూర్ వీఎఫ్ఎక్స్, సమంత డబ్బింగ్, గుణ శేఖర్ మేకింగ్ ఏవీ కూడా సినిమాను నిలబెట్టలేదని, అవే మైనస్ అయ్యాయని టాక్.

అయితే ఇప్పుడు సినిమాకు చేయాల్సిన ప్రమోషన్స్‌లోనూ మార్పులు చేశారట. మామూలుగా అయితే ఇప్పుడు మీడియాకు సపరేట్‌గా రెండ్రోజుల ముందే షోను వేయాలని అనుకున్నారట. అంటే నేడు మీడియా షో ఉండాలి. కానీ నెగెటివ్ టాక్ మరింతగా స్ప్రెడ్ అయ్యే చాన్స్ ఉందని దిల్ రాజు భావించాడట. అందుకే మీడియాకు ముందుగా వేయాల్సిన షోను క్యాన్సిల్ చేశారట. ఇక సమంతతో చేయించాల్సిన ప్రమోషన్స్‌ను కూడా క్యాన్సిల్ చేశారట.

సమంత పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయ్యేలా ఉందని తెలుస్తోంది. సమంత కష్టపడి చెప్పిన డబ్బింగ్‌ కూడా వృథా అయ్యేట్టు అనిపిస్తోంది. అయితే తాజాగా సమంత శాకుంతలం సినిమా మీద ఆమె ఫ్రెండ్ నీరజ కోన కొడుకు స్పందించాడు. సామ్ ఆంటీ.. ఇంకా రెండ్రోజులే ఉంది.. శాకుంతలం సినిమా రాబోతోందంటూ నీరజ కోన పోస్ట్ వేస్తే.. సమంత స్పందిస్తూ.. లవ్ సింబల్‌ను షేర్ చేసింది.

Also Read:  Pawan Kalyan Fans : వేధిస్తున్న పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌.. రేణూ దేశాయ్ ఆవేదన.. అకిరా బర్త్ డే రచ్చ రచ్చ

ఇక సమంతకు యశోద సినిమా బాగానే కలిసి వచ్చింది. ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అయి సమంత మార్కెట్‌ ఇంకా ఉందని ఫ్రూవ్ చేసింది. అయితే ఈ శాకుంతలం సినిమా మాత్రం కనీసం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేసేందుకు కష్టపడేలా ఉంది. ఇక పాన్ ఇండియన్ వైడ్‌లో శాకుంతలం సినిమాకు ఎటువంటి బజ్ లేదని అర్థం అవుతూనే ఉంది.

సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేస్తోంది. కేరళలోని అందమైన లొకేషన్లలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఆ తరువాత మళ్లీ రాజ్ అండ్ డీకేతో సిటాడెల్ వెబ్ సిరీస్ కూడా చేస్తోన్న విషయం విదితమే.

Also Read: Renu Desai-Pawan Kalyan Fan : మీ అన్న కొడుకా?.. అకిరా నా కొడుకు.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌పై రేణూ దేశాయ్ ఫైర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News