Bhagavanth Kesari: బాలయ్య మార్క్ యాక్షన్, డైలాగ్స్ తో ‘'భగవంత్‌ కేసరి'’ ట్రైలర్‌

Bhagavanth Kesari Trailer: బాలయ్య ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూసిన ‘భగవంత్‌ కేసరి ట్రైలర్ వచ్చేసింది. మీరు ఓ లుక్కేయండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 8, 2023, 09:26 PM IST
Bhagavanth Kesari: బాలయ్య మార్క్ యాక్షన్, డైలాగ్స్ తో ‘'భగవంత్‌ కేసరి'’ ట్రైలర్‌

Bhagavanth Kesari Trailer: బాలయ్య అభిమానులు ఎంతోగానే ఎదురుచూసిన 'భగవంత్ కేసరి ట్రైలర్' (Bhagavanth Kesari Trailer) వచ్చేసింది. బాలయ్య డైలాగ్స్, యాక్షన్స్ తో ట్రైలర్ మెుత్తం దద్దరిల్లిపోయింది. ''నువ్వు ఎక్కడున్నా దమ్ముతో నిలబడాలి... అప్పుడే దునియా మెుత్తం నీ బాంచన్ అవుతోంది'' అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మెుదలైంది. 'ఆర్మీ ఇజ్ నాట్ ఏ ఆక్యుపేషన్..ఇట్ ఇజ్ ఏన్ ఇన్సిపేరేషన్' అనే చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. బాలయ్యలోనే మరోకామెడీ యాంగిల్ ను చూపించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ట్రైలర్ రిలీజ్ వేడుకను వరంగల్‌లో ఆదివారం నిర్వహించారు మేకర్స్. 

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో టాలీవుడ్ యంగ్ సెన్షెషన్ శ్రీలీల నటించింది. ‘ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్, విలన్ గా బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంఫాల్ నటించారు.  భగవంత్ కేసరి సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై  సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ మూవీపై వీరలెవల్లో అంచనాలను పెంచేశాయి.  ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే మూవీ ప్రమోషన్స్ షురూ చేయనుంది మూవీటీమ్. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

  

Trending News