NBK - Bhagavanth Kesari: బాలయ్య'భగవంత్ కేసరి' హిందీ డిజిటల్ ప్రీమియర్‌కు అందా సిద్ధం.. ఎపుడంటే..

NBK - Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా ఈయన వరుస హిట్స్‌తో దూకుడు మీదున్నాడు. గతేడాది చివరలో 'భగవంత్ కేసరి' సినిమాతో పలకరించారు. తాజాగా ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్‌కు అంతా సిద్ధమైంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 4, 2024, 12:45 PM IST
NBK - Bhagavanth Kesari: బాలయ్య'భగవంత్ కేసరి' హిందీ డిజిటల్ ప్రీమియర్‌కు అందా సిద్ధం.. ఎపుడంటే..

NBK - Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ లాస్ట్ ఇయర్ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ వరుస సక్సెస్ అందుకున్నారు. ఇక భగవంత్ కేసరి సినిమా విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. రీసెంట్‌గా ఈ మూవీ 100 రోజుల పరుగును కంప్లీట్ చేసుకుంది. డిజిటల్ యుగంలో ఓ సినిమా ఓ థియేటర్‌లో వంద రోజులు పూర్తి చేసుకోవడం అనేది రేర్ ఆఫ్ ది రేర్ అని చెప్పాలి. ఈ రేంజ్‌లో తన జనరేషన్‌ హీరోల్లో సక్సెస్ అందుకుంటున్న కథానాయకుడు బాలయ్య మాత్రమే.

గతంలో ఎన్నడు లేనంతగా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు బాలయ్య. అంతేకాదు వరుస సక్సెస్‌లతో దూకుడు మీదున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'అఖండ'తో పవర్‌ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చిన బాలయ్య.. ఆ తర్వాత 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి బ్యాక్ టూ బ్యాక్ వరుస సక్సెస్‌లతో చాలా యేళ్ల తర్వాత హాట్రిక్ హిట్స్ నమోదు చేసారు. ఈ మూవీలో బాలయ్య ఎలాంటి డ్యూయట్ లేకుండా తన ఏజ్‌కు తగ్గ పాత్రలో నటించి మెప్పించారు. అంతేకాదు యాక్షన్ సీక్వెన్స్‌లలో తనదైన బ్రాండ్ క్రియేట్ చేసారు.

'భగవంత్ కేసరి' మూవీతో బాలయ్య రికార్డులను బద్దులు కొట్టాడు. సీనియర్ హీరోల్లో వరుసగా ఎవరు మూడు రూ. 100 కోట్ల గ్రాస్.. రూ. 70 కోట్ల షేర్ అందుకున్న హీరో ఎవరు లేరు. తన  జనరేషన్ హీరోల్లో ఈ రికార్డు అందుకున్న ఏకైక సీనియర కథానాయకుడిగా నిలిచారు. ముఖ్యంగా బాలకృష్ణ గెటప్, మాస్ అప్పీరియన్స్, డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 72 కోట్ల షేర్.. రూ. 135 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా ఇరగదీస్తోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌కు బాలయ్య చెప్పిన డైలాగులపై నార్త్ ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

ఇక ఈ మూవీ హిందీ డిజిటల్ ప్రీమియర్ ఈ రోజు సాయంత్రం సినీ ప్లక్స్ ఛానెల్‌లో ప్రసారం  కానుంది. మరోవైపు ఈ సినిమాను తమిళంలో విజయ్ హీరోగా రీమేక్ కానుంది. రాజయాల్లోకి వెళ్లే ముందు చేయబోయే సినిమా ఇదే కావడం విశేషం.

ఈ డిజిటల్ యుగంలో బాలయ్య నటించిన సినిమాలు వరుసగా హిట్ అవ్వడమే కాదు.. థియేట్రికల్‌గా 100 రోజులు పూర్తి చేసుకోవడం కూడా మాములు విషయం కాదు. బాలయ్య.. ప్రస్తుతం బాబీ (కే.యస్.రవీంద్ర) దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టేనర్‌ చేస్తున్నారు. ఈ మూవీలో మరోసారి డాన్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News