Nayanthara Bikini : బికినీలో నయనతార.. తల్లైనా తగ్గేదేలే.. ఆ హీరో కోసమే చేస్తోందా?

Nayanthara Wears Bikini నయనతార బికినీలో కనిపించి చాలా కాలమే అయింది. కెరీర్ ప్రారంభంలో నయన్ బికినీ ధరించింది. ఆ తరువాత నయన్ క్రేజ్ పెరిగిపోవడం, లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులు చేయడంతె బికినీలకు దూరంగా ఉంటోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2023, 10:29 AM IST
  • బికినీలో ధరించనున్న నయన్
  • షారుఖ్ ఖాన్ కోసమే చేస్తోందా?
  • తల్లైనా తగ్గేదేలే అంటోన్న నయనతార
Nayanthara Bikini : బికినీలో నయనతార.. తల్లైనా తగ్గేదేలే.. ఆ హీరో కోసమే చేస్తోందా?

Nayanthara Wears Bikini For Jawan నయనతారకు ప్రస్తుతం ఎలాంటి డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. నయనతారకు ఓ కథ చెప్పి ఒప్పించడం ఎంతోకష్టంగా మారింది. ఆమె పాత్రకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఉండాలి.. లేడి ఓరియెంటెడ్ సబ్జెక్టులు అయి ఉండాలి.. ఇక రెమ్యూనరేషన్ అడిగినంత ఇవ్వాలి.. ప్రమోషన్లకు కూడా బయటకు రాదు.. ఇలా ఎన్నెన్నో కండీషన్లు ఉంటాయి. ముద్దు సీన్లకు నో చెబుతుంది. అలాంటి నయన్.. ఇప్పుడు బికినీ ధరించేందుకు రెడీ అయినట్టు టాక్.

షారుఖ్ ఖాన్ దెబ్బ కొడితే ఎలా ఉంటుందో బాక్సాఫీస్‌కు మరోసారి రుచి చూపించాడు. పఠాన్ సినిమాతో షారుఖ్‌ ఖాన్ బాలీవుడ్ మొత్తాన్ని నిలబెట్టేశాడు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. అన్ని రికార్డులను బద్దలు కొట్టేశాడు. షారుఖ్ ఒక్క హిట్టు కొట్టేందుకు ఎంత కాలం సహనంగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. చివరకు జీరో సినిమాతో జీరో అయ్యాడు. ఇప్పుడు పఠాన్ సినిమాతో బాలీవుడ్‌కు రియల్‌ హీరోగా నిలిచాడు.

అలాంటి షారుఖ్ ఇప్పుడు వరుసగా సినిమాలు రెడీ చేస్తున్నాడు. అట్లీతో జవాన్, రాజ్ కుమార్ హిరాణితో డుంకీ సినిమాలు చేస్తున్నాడు. జవాన్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమాను అట్లీ పాన్ ఇండియాగా ప్లాన్ చేశాడు. అందుకే సౌత్ మార్కెట్ కలిసి వచ్చేలా నయన్‌ను రంగంలోకి దించాడు. ఈ మూవీ కోసమే నయన్ బికినీ ధరిస్తుందని టాక్.

పెళ్లైన హీరోయిన్లు ఈ మధ్య ఏ మాత్రం తగ్గడం లేదు. తల్లైనా కూడా అందాల ఆరబోతలో డోస్ పెంచేస్తోంది. నయన్ ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లి. అయినా కూడా బికినీ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. అయితే నయన్ బికినీ ధరిస్తుందా? లేదా? అన్నది మాత్రం టీం నుంచి క్లారిటీ రాలేదు. 

పఠాన్ సినిమాలో దీపిక వేసుకున్న బికినీ ఎంతటి వివాదానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే. బేషరమ్ సాంగ్‌, దీపిక బికినీ ట్రీట్ మీద నేషనల్ వైడ్‌గా జరిగిన ట్రోల్, రచ్చ అందరికీ తెలిసిందే. మరోసారి షారుఖ్ సినిమాతో నయన్ బికినీ ధరిస్తుందట. మరి నయన్ బికినీ మీద ఎలాంటి రచ్చ జరుగుతుందో చూడాలి.

Also Read:  Manchu Manoj Vs Manchu Vishnu: రోడ్డున పడ్డ మంచు గౌరవం?.. ఇంటిపై దాడులు చేస్తాడు మంచు విష్ణు వీడియో షేర్ చేసిన మనోజ్

Also Read: Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News