Nayanthara: ఇంకా హనీమూన్ మూడ్ లోనే నయనతార-విగ్నేష్.. ఆ దేశానికి జంప్!

Nayanthara Vignesh Shivan to Vacation: నయనతార -  విగ్నేష్ శివన్ హనీమూన్ ఇంకా పూర్తయినట్లు కనిపించడం లేదు. ఈ జంట మళ్ళీ విదేశాలకు చెక్కేశారు!

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 13, 2022, 07:45 AM IST
Nayanthara: ఇంకా హనీమూన్ మూడ్ లోనే నయనతార-విగ్నేష్.. ఆ దేశానికి జంప్!

Nayanthara Vignesh Shivan to Vacation: ఈ మధ్యనే ప్రేమించి పెళ్లాడిన నయనతార, విగ్నేష్ శివన్ హనీమూన్ ఇంకా పూర్తయినట్లు కనిపించడం లేదు. ఈ జంటకు కాస్త గ్యాప్ దొరికితే ప్రైవసీ కోసం విదేశాలకు వెళ్ళిపోతున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి తాము విదేశాలకు వెళుతున్నట్టు సోషల్ మీడియాలో వెల్లడించారు. దర్శకుడు విగ్నేష్ శివన్ తన భార్య హీరోయిన్ నయనతారతో కలిసి స్పెయిన్ లోని బార్సిలో నాకు ఒక వెకేషన్ కి వెళ్తున్నట్లుగా ప్రకటించారు.

ఇంస్టాగ్రామ్ లో విమానంలో తాను నయనతార కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ‘’పని పని పని అవిశ్రాంతంగా పనిచేసిన తర్వాత మేము కొంత సమయం గడపడానికి వెళుతున్నాము, బార్సిలోనా మేము వచ్చేస్తున్నాము’’ అంటూ పేర్కొన్నారు. నిజానికి ఇటీవల చెన్నైలో జరిగిన చెస్ ఒలంపియాడ్ ప్రారంభ అలాగే ముగింపు వేడుకలను భారీ ఎత్తున గ్రాండ్గా జరిపించాలని తమిళనాడు ప్రభుత్వం భావించింది. అందులో విగ్నేష్ శివన్ కూడా ఒక కీలకమైన సభ్యుడిగా ఉన్నారు.

కొన్ని వారాలుగా ఈ విషయం కోసమే ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఇక ఈవెంట్ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఈవెంట్ ను విజయవంతం చేయడంలో అనేక ప్రశంసలు అందుకున్న విగ్నేష్ శివన్ ఇప్పుడు వెకేషన్ మోడ్ లోకి వెళ్లారు. నిజానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ ముగింపు వేడుకలలో ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ గా జరగడానికి విగ్నేష్ శివన్ కూడా ఒక కారణమని ప్రస్తావించారు. అన్నట్టు వీరిద్దరి వివాహ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే వీరి వివాహానికి సంబంధించి ఒక చిన్న టీజర్ లాగా విడుదల చేసి త్వరలోనే వీరి వివాహ వేడుకను నెట్ఫ్లిక్స్ లో చూస్తారంటూ కామెంట్ చేసింది.

మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరికొద్ది రోజులలో నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లిని కూడా మనం నెట్ఫ్లిక్స్ లో ఒక సినిమా చూసినట్టు చూడబోతున్నాము. నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తరహాలో ఈ పెళ్లిని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. భారీ విజువల్స్ తో ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయే విధంగా పెళ్లిని షూట్ చేశారని అంటున్నారు. ఈ పెళ్లి మొత్తం షూటింగ్ అంతా కూడా గౌతమ్ వాసుదేవ్ ఆధ్వర్యంలో జరిగిందని తెలుస్తోంది.
Also Read: KGF 2: కేజీఎఫ్ 2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్.. జీ తెలుగులో ఎప్పుడంటే?

Also Read:Karthikeya 2: కార్తికేయ 2 ట్విట్టర్ రివ్యూ... సినిమా ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News