Nayanthara Ajith Movies : అజిత్‌ను పూర్తిగా దూరం పెట్టిందా?.. భర్తకు జరిగిన అవమానంతో నయన్ సంచలన నిర్ణయం

Nayanthara Ajith Movies కోలీవుడ్‌లో అజిత్, నయన్ జోడికి మంచి క్రేజ్ ఉంది. ఈ ఇద్దరిది హిట్ పెయిర్. ఇప్పటికే వీరి కాంబోలో నాలుగైదు సినిమాలు వచ్చాయి. అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లే. చివరగా విశ్వాసం అనే సినిమాతో వచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2023, 04:01 PM IST
  • AK 62 నుంచి విఘ్నేశ్‌ అవుట్
  • భర్తకు జరిగిన అవమానంపై నయన్ ఫైర్
  • అజిత్‌ సినిమాలకు నయన్ ఇక గుడ్ బై?
Nayanthara Ajith Movies : అజిత్‌ను పూర్తిగా దూరం పెట్టిందా?.. భర్తకు జరిగిన అవమానంతో నయన్ సంచలన నిర్ణయం

Nayanthara Ajith Movies కోలీవుడ్‌లో నయనతార, విఘ్నేశ్ శివన్ కాంబో గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి కాంబోలో బిల్లా, ఆరంభం, విశ్వాసం ఇలా వచ్చిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అయితే అజిత్‌తో తన భర్తకు ఓ సినిమాను సెట్ చేసి పెట్టింది నయనతార. విఘ్నేశ్ శివన్ అజిత్‌ నయనతార కాంబోలో సినిమాను లైకా సంస్థ ప్రకటించింది కూడా. విఘ్నేశ్ కూడా గాల్లో తేలిపోయాడు.

అయితే విఘ్నేశ్ శివన్ చెప్పిన పూర్తి స్క్రిప్ట్ అజిత్‌కు నచ్చలేదట. అజిత్ కొన్ని మార్పులు చేర్పులు సూచించాడట. కానీ విఘ్నేశ్ శివన్ మాత్రం వాటికి అంగీకరించలేదట. దీంతో విఘ్నేశ్ శివన్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించేశారు. దీంతో నయన్ కూడా హర్ట్ అయినట్టుగా ఉంది. ఇక దీంతో నయన్ ఓ కఠిన నిర్ణయం తీసుకుందట. అజిత్ సినిమాలకు ఇకపై దూరంగా ఉండాలని అనుకుంటోందట.

ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేద్దామని నయన్ ప్రయత్నించినా కుదర్లేదట. అలా అజిత్ సినిమాల్లో ఇకపై తాను నటించేది లేదని నయన్ అనుకుంటోందట. అయితే ఈ ప్రాజెక్ట్ ఇలా క్యాన్సిల్ అవ్వడం వల్ల నయన్‌, అజిత్‌లకు పోయేదేమీ లేదని తెలిసిందే. కానీ విఘ్నేశ్ శివన్ కెరీర్ మాత్రం సంకటంలో పడ్డట్టుగా మారింది.

ఇంత వరకు విఘ్నేశ్ శివన్ ఏ స్టార్ హీరోను కూడా డైరెక్ట్ చేయలేదు. అజిత్ లాంటి పెద్ద హీరోతో సినిమా తీసి హిట్ కొట్టి ఉంటే.. కోలీవుడ్‌లో అతని పేరు మార్మోగిపోయేది.     అయితే ఇప్పుడు విఘ్నేశ్ శివన్ చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. నయన్ హీరోయిన్‌గా కొన్ని సినిమాలను విఘ్నేశ్ నిర్మిస్తున్నాడంతే.

ఇప్పుడు విఘ్నేశ్ శివన్‌కు మరొక క్రేజీ ప్రాజెక్ట్ ఓకే అయితే తప్పా తనని తాను నిరూపించుకోలేడు. అజిత్ లాంటి హీరో మార్పులు చేర్పులు  చెప్పినా ఒప్పుకోలేదంటే, తన కథ మీద అంత నమ్మకమైనా ఉండాలని లేదా తలపొగరైనా ఉంటుందని నెటిజన్లు అనుకుంటున్నారు.

Also Read:  Kalyan Ram Amigos Collections : అత్యంత దారుణంగా అమిగోస్ కలెక్షన్లు.. సుహాస్ కంటే తక్కువ?

Also Read: Shraddha Das Pics : ఆ పార్ట్‌ని మాత్రం క్లియర్‌గా చూపిస్తోన్న శ్రద్దా దాస్.. చూస్తే హీటెక్కాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News