Nayanathara - vignesh shivan: చెన్నైలోని పోష్ ఏరియాలో రెండు బంగ్లాలు కొన్న నయనతార.. అన్ని కోట్లా?

Nayanathara Bus two houses:  తమిళ మీడియా వర్గాలలో జరుగుతున్న ప్రచారం మేరకు తమిళనాడులో జయలలిత నివాసం ఉండే పోయేస్ గార్డెన్ ప్రాంతంలో నయనతార రెండు బంగ్లాలను కొనుగోలు చేసినట్లు సమాచారం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 5, 2022, 02:44 PM IST
  • కొద్దిరోజుల క్రితమే నయనతార విగ్నేష్ శివన్ ల వివాహం
  • షూటింగ్స్ లో బిజీ అయిన జంట
  • చెన్నైలో పోయెస్ గార్డెన్ ప్రాంతంలో రెండు బంగ్లాలు కొనుగోలు
Nayanathara - vignesh shivan: చెన్నైలోని పోష్ ఏరియాలో రెండు బంగ్లాలు కొన్న నయనతార.. అన్ని కోట్లా?

Nayanathara Bus two houses: ఒకరిద్దరితో ప్రేమాయణం నడిపి పెళ్లి పీటల వరకు వెళ్లి తర్వాత బ్రేకప్ చెప్పిన నయనతార ఎట్టకేలకు దర్శకుడు విగ్నేష్ శివన్ ను వివాహమాడిన సంగతి తెలిసిందే. అతి కొద్ది మంది సన్నిహితులు,  శ్రేయోభిలాషుల మధ్య వీరిద్దరి వివాహం గత నెలలో మహాబలిపురంలో జరిగింది. ఆ తరువాత నేరుగా తిరుమలకు వచ్చిన ఈ జంట అనూహ్య పరిస్థితులలో ఒక వివాదంలో కూడా చిక్కుకుంది. ఇక ఆ తర్వాత మిస్సయిన ఈ జంట హనీమూన్ ఫోటోలు విడుదల చేయడం ద్వారా మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. 
 
అయితే హనీమూన్ పూర్తి చేసుకుని షూటింగులకు హాజరవుతున్న ఈ జంట గురించి ఇప్పుడు తమిళ మీడియా వర్గాలలో ఒక ఆసక్తికర ప్రచారం మొదలైంది.. తాజాగా తమిళ మీడియా వర్గాలలో జరుగుతున్న ప్రచారం మేరకు తమిళనాడులో జయలలిత నివాసం ఉండే పోయేస్ గార్డెన్ ప్రాంతంలో నయనతార రెండు బంగ్లాలను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ పోయేస్ గార్డెన్ అంటే ఒక రకంగా చెన్నైలో సెలబ్రిటీల అడ్డా అనే చెప్పాలి. ఈ ప్రాంతంలో రజినీకాంత్ సహా జయలలిత,  శశికళ వంటి వారికి బంగ్లాలు ఉన్నాయి. ఇప్పుడు నయనతార కూడా తన వివాహ జీవితాన్ని ఈ పోయస్ గార్డెన్ ప్రాంతం నుంచి ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. 
 
నయనతార కొనుగోలు చేసిన రెండు బంగ్లాలు కూడా సుమారు ఎనిమిది వేల చదరపు అడుగుల స్థలంలో నిర్మించబడి ఉన్నాయని తెలుస్తోంది. కొనుగోలు కోసమే కోట్ల రూపాయలు వెచ్చించిన ఈ దంపతులు, దాన్ని రేన్నోవేట్ చేయడానికి కూడా భారీగా ఖర్చు పెడుతున్నారని టాక్. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలకు ఇంటీరియర్ డిజైనింగ్ చేసే ఒక ప్రముఖ సంస్థ ఈ బంగ్లాలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్ధేందుకు రంగంలోకి దిగిందని తెలుస్తోంది. నయనతార విగ్నేష్ శివన్ ఇద్దరికీ ప్రైవసీ ఉండే విధంగా వాటిని సిద్ధం చేస్తున్నట్లు టాక్. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయని,  అవి పూర్తయిన వెంటనే మంచి ముహూర్తం చూసుకుని ఈ ఇద్దరు గృహప్రవేశం చేస్తారని తెలుస్తోంది. గృహప్రవేశం జరిగిన తరువాత తెలుగు,  తమిళ,  కన్నడ,  మలయాళ,  హిందీ సినీ పరిశ్రమలకు చెందిన తమకు ముఖ్యమైన వారందరినీ పిలిచి ఒక గ్రాండ్ పార్టీ ఇవ్వడానికి ఈ జంట సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Also Read: Bimbisara Trailer: కల్యాణ్‌రామ్‌ నట విశ్వరూపం.. బింబిసార ట్రైలర్ అద్భుతం!

Also Read: God Father: మెగా అభిమానులకు ఇక పునకాలే.. గాడ్‌ ఫాదర్ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News