Nani With Anchor Suma: ప్రోమోల కోసం హీరో నాని కూడా ఇలా చేస్తున్నాడా..? అవాక్కైన యాంకర్ సుమ

Nani Dasara Promotions @ Suma Adda : నాని దసరా సినిమా ప్రమోషన్స్‌ భారీ ఎత్తున చేపడుతున్నాడు. నాని దేశ వ్యాప్తంగా తిరుగుతున్నాడు. సినిమాను మాగ్జిమమ్ వీలైనంతగా ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు బుల్లితెరపై దసరా టీం హల్చల్ చేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2023, 09:35 AM IST
  • దసరా ప్రమోషన్స్‌లో బిజీగా నాని
  • యాంకర్ సుమ షోలో సందడి
  • కాంట్రవర్సీ కామెంట్లు చేసిన నాని
Nani With Anchor Suma: ప్రోమోల కోసం హీరో నాని కూడా ఇలా చేస్తున్నాడా..? అవాక్కైన యాంకర్ సుమ

Nani With Anchor Suma @ Suma Adda : బుల్లితెరకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ఫ్యామిలీ అంతా థియేటర్లకు రావడం లేదేమో గానీ టీవీల ముందు మాత్రం ఉంటున్నారు. అందుకే సినిమాలను ఎక్కువగా బుల్లితెరలపై ప్రచారం చేస్తున్నారు. బుల్లితెరపై వచ్చే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలకు సినిమా టీం వస్తుంటుంది. ఆడి పాడి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటారు. పండుగలకు స్పెషల్ ఈవెంట్లు ఉంటే వాటిల్లోనూ కనిపిస్తుంటారు.

ఇప్పుడు ఉగాది పండుగ రాబోతోంది. ఈ క్రమంలో దసరా సినిమాను బుల్లితెరపై నాని ప్రమోట్ చేస్తున్నాడు. జీ, స్టార్ మా, ఈటీవీ ఇలా అన్ని చానెల్లలో ఉగాది ఈవెంట్లు వస్తున్నాయి. అన్నింట్లోనూ నాని కనిపించాడు. తన దసరా సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు. అయితే తాజాగా సుమ అడ్డా షోకు సంబంధించిన ప్రోమో వచ్చింది.

ఇందులో నాని కావాలనే కాంట్రవర్సీ కామెంట్లు చేసి ప్రోమో కోసం స్టంట్లు చేయించిందా? అనే అనుమానం కలుగుతోంది. ఇక సుమ షోలోనూ ఈ మధ్య ఈ టీఆర్పీ స్టంట్లు ఎక్కువయ్యాయ్ అన్న సంగతి తెలిసిందే. అయితే నాని ఈ ప్రోమోలో కొన్ని కాంట్రవర్సీ కామెంట్లుచేశాడు. సక్సెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు సైతం సక్సెస్ కాలేదు కదా? అని నాని అన్నాడు. దసరా సినిమాను తాను అనుకున్నంత బాగా తీయలేదని దర్శకుడు శ్రీకాంత్ గురించి నాని అన్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News