Nandamuri Balakrishna : దిల్ లేని రాజు.. దిల్ రాజు.. బాలయ్య పంచ్‌లు

Nandamuri Balakrishna Counters on Dil Raju నందమూరి బాలకృష్ణ చేసే కామెంట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అంతటి పెద్ద హీరో జోక్ వేస్తే కచ్చితంగా నవ్వాల్సిందే అన్నట్టుగా ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2022, 09:48 AM IST
  • బాలయ్య కొత్త చిత్రం షురూ
  • అనిల్ రావిపూడి కోసం వచ్చిన దిల్ రాజు
  • దిల్ రాజు మీద బాలయ్య కౌంటర్లు
Nandamuri Balakrishna : దిల్ లేని రాజు.. దిల్ రాజు.. బాలయ్య పంచ్‌లు

Nandamuri Balakrishna Counters on Dil Raju మనం వేసే జోకులను ఇతరులు సరదాగా తీసుకుంటారా? లేదా? అన్నది స్పష్టంగా చెప్పలేం. ఇప్పుడు అలాంటి ఓ ఘటనే జరిగింది. నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా (NBK 108) రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ వేడుకలకు దిల్ రాజు, దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు గెస్టులుగా వచ్చారు.అయితే ఈ ఈవెంట్లోనే దిల్ రాజు మీద బాలయ్య కౌంటర్లు వేశాడట. ఓ పావుగంట పాటు బాలయ్య ఏడిపిస్తూనే వచ్చాడట.

దిల్ రాజు అని నిన్ను ఎందుకు పిలుస్తారు.. నీకు దిల్ లేదు కదా? అని అన్నాడట బాలయ్య. నా పేరు రాజు.. నేను దిల్ సినిమాను చేయడంతో అలా పిలుస్తున్నారు అని దిల్ రాజు క్లారిటీగా చెప్పాడట. అలా అన్న తరువాత బాలయ్య మరో కౌంటర్ వేశాడ. నీకు దిల్ కూడా లేదు అని మరోమారు నొచ్చుకునేలా కౌంటర్లు వేశాడట.

అసలే ఇప్పుడు ఇండస్ట్రీలో దిల్ రాజు మీద చాలా మంది గుర్రుగా ఉన్నారు. విజయ్ వారసుడు సినిమాను తమిళ సినిమా అని చెప్పి.. డబ్బింగ్ చిత్రమైనా కూడా సంక్రాంతి బరిలో ఎక్కువ థియేటర్లు ఇవ్వడం, అది కూడా బాలయ్య, చిరులు పోటీలో ఉన్నప్పుడు ఇలా చేయడం ఏంటి? అంటూ అందరూ తిట్టిపోస్తున్నారట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే బాలయ్య కూడా కౌంటర్లు వేసినట్టు కనిపిస్తోంది.

ఏది ఏమైనా కూడా బాలయ్య మాత్రం తన మనసులో ఏది పెట్టుకోకుండా ఉంటాడని మరోసారి రుజువైంది. తనకు అనిపించి అనేస్తాడని, లోపల ఏమీ దాచుకోడని తెలిసిందే. కానీ దిల్ రాజు మాత్రం బాలయ్య అంతటి వాడిని ఏమీ అనలేక, తిరిగి కౌంటర్ వేయలేక అలా నిల్చుండిపోయాడని తెలుస్తోంది.

Also Read : Bigg Boss Shannu - Deepthi : దీప్తిని పూర్తిగా మరిచిపోయిన షన్ను.. ఈ పోస్ట్ అర్థం అదేనా?

Also Read : Allu Arjun Team : బన్నీ టీం వల్ల తడిసిమోపడైంది!.. పుష్ప కోసం రష్యాలో పెట్టిన ఖర్చు ఎంతంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News