Bangarraju Movie: 'బంగార్రాజు' రిస్క్ చేస్తున్నాడా? సంక్రాంతి బరిలో నిలవనున్నాడా?

Bangarraju Movie: నాగార్జున 'బంగార్రాజు' సంక్రాంతికి రిలీజ్ కాబోతుందన్న వార్త నెట్టింట వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన అప్ డేట్ రెండు రోజుల్లో రానున్నట్లు సమాచారం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2021, 11:48 AM IST
Bangarraju Movie: 'బంగార్రాజు' రిస్క్ చేస్తున్నాడా? సంక్రాంతి బరిలో నిలవనున్నాడా?

Bangarraju Movie: 'బంగార్రాజు' సంక్రాంతి బరిలో నిలవనుందా? రెండు భారీ చిత్రాలకు పోటీగా ఈ మూవీని రేసులో నిలుపుతారా?.. అవుననే గుసగుసలు ఫిలింసర్కిల్ లో వినిపిస్తోంది. నాగార్జున, నాగచైతన్య (Naga Chaitanya) కలిసి నటించిన చిత్రం 'బంగార్రాజు' (Bangarraju Movie). ఇందులో వీరికి జోడీలుగా రమ్యకృష్ణ, కృతిశెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం సంక్రాంతి సీజన్‌లో వెండితెరపైకి రానుందనే వార్త నెట్టింట చక్కెర్లు కొడుతోంది. 

అయితే సంక్రాంతి బరిలో రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. 'ఆర్ఆర్ఆర్' (RRR Movie)’ జనవరి 7న, ‘'రాధేశ్యామ్'’(Radheshyam) జనవరి 14న రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పోటీలో ఉన్న భీమ్లా నాయక్ ను పక్కకు తెప్పించారు. ఓ పక్క ఒమిక్రాన్ (Omicron) కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో..బంగార్రాజు రిస్క్ చేస్తాడో లేదో వేచి చూడాలి.

Also Read: Rajamouli: 'తారక్ దేశం గర్వించదగ్గ నటుడు...చరణ్ మై హీరో'..: రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

నాగార్జున (Nagarjuna) మరో రెండు రోజుల్లో ‘బంగార్రాజు’కు సంబంధించిన మేజర్ అప్‌డేట్‌ను తెలియజేయనున్నట్లు సమాచారం. ‘బంగార్రాజు’ జనవరి 15న వెండితెరపైకి రానున్నట్లు నాగార్జున అధికారికంగా ప్రకటించనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేయనున్నారట. ఇదే గనుక నిజమైతే ‘భీమ్లా నాయక్’ స్థానాన్ని ‘బంగార్రాజు’ భర్తీ చేసినట్లే.!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News