Nagarjuna reacts to Samantha's divorce: సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైంది ‌‌- నాగార్జున

Nagarjuna reacts to Samantha,Naga Chaitanya's divorce : చైతూ-సమంత విడిపోవడం నిజంగా చాలా దురదృష్టకరమన్నారు నాగ్. చై-సామ్‌లు తాము భార్యాభర్తలుగా విడిపోతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2021, 07:09 PM IST
  • చైతు-సమంత విడాకులపై స్పందించిన నాగార్జున
  • నాగచైతన్య-సమంతల విడిపోవడం దురదృష్టకరమన్న నాగార్జున
  • భార్యభర్తలు విడిపోవడం వారి వ్యక్తిగత విషమన్న నాగ్
Nagarjuna reacts to Samantha's divorce: సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైంది ‌‌- నాగార్జున

Nagarjuna reacts to Samantha, Akkineni Naga Chaitanyas unfortunate split, says she will always be dear to the family: నాగచైతన్య-సమంతల ( Naga Chaitanya-Samantha) విడాకులపై నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున (Nagarjuna) స్పందించారు. చైతూ-సమంత విడిపోవడం నిజంగా చాలా దురదృష్టకరమన్నారు నాగ్. చై-సామ్‌లు (sam chay) తాము భార్యాభర్తలుగా విడిపోతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే భార్యభర్తలు (wife husband) విడిపోవడం వారి వ్యక్తిగత విషమని తెలిపారు నాగ్. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు కింగ్ నాగార్జున. చైతు-సమంత ఎప్పటికీ తన గుండెల్లో ఉంటారని నాగార్జున (Nagarjuna) తెలిపారు.

Also Read : RRR movie release date: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్ ఫిక్స్..వచ్చే ఏడాది రానున్న మూవీ

ఎంతో బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోందని పేర్కొన్నారు నాగ్ (Nag). సమంత, నాగచైతన్య ఇద్దరూ తనకెంతో దగ్గరి వారు అని అన్నారు నాగార్జున. సమంతతో తన కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైందని గుర్తు చేసుకున్నారు. సమంత (Samantha) తమ కుటుంబానికి చాలా దగ్గరైందని దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా అని పేర్కొన్నారు నాగార్జున. వారికి తన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు నాగ్.

 

కాగా గత కొన్ని రోజులుగా నాగచైతన్య, సమంతలు విడిపోతారని సోషల్ మీడియాలో (social media) వైరల్ అయినా అది నిజం కాదులే అనుకున్నారు అంతా. కానీ ఇవ్వాళ నాగచైతన్య,(Nagarjuna) సమంత (Samantha) స్వయంగా తాము విడిపోతున్నట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ ఎంతో బాధపడుతున్నారు.

Also Read : Samantha, Naga Chaitanya separation : భార్యభర్తలుగా విడిపోయిన నాగ చైతన్య, సమంత.. తమ స్నేహబంధం కొనసాగుతదన్న చై..స్యామ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News