Naga Shaurya బర్త్ డే స్పెషల్.. Lakshya Teaser విడుదల

Lakshya movie teaser out: నాగశౌర్య బర్త్ డే సందర్భంగా అతడు నటిస్తున్న అప్ కమింగ్ మూవీ లక్ష్య టీజర్ విడుదల చేశారు ఆ చిత్ర నిర్మాతలు. సంతోష్ జాగర్లపూడి అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ అధినేత శరత్ మరార్, నారాయణ్ దాస్ నారాయణ, రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Last Updated : Jan 22, 2021, 07:17 PM IST
Naga Shaurya బర్త్ డే స్పెషల్.. Lakshya Teaser విడుదల

Lakshya movie teaser out: నాగశౌర్య బర్త్ డే సందర్భంగా అతడు నటిస్తున్న అప్ కమింగ్ మూవీ లక్ష్య టీజర్ విడుదల చేశారు ఆ చిత్ర నిర్మాతలు. సంతోష్ జాగర్లపూడి అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ అధినేత శరత్ మరార్, నారాయణ్ దాస్ నారాయణ, రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లక్ష్య మూవీ కోసం నాగశౌర్య తన లుక్‌ను తాను పూర్తిగా మార్చుకుని సరికొత్త మేకోవర్‌తో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా కోసం నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాడీతో ( Six pack body ) ఆడియెన్స్ ముందుకొస్తున్నాడు. 

Also read : Pawan Kalyan in Swamy getup: స్వామీజీ అవతారంలో పవన్ కల్యాణ్.. ఫోటోలు వైరల్

లక్ష్య మూవీలో నాగశౌర్య సరసన Ketika Sharma జంటగా నటిస్తోంది. జగపతి బాబు మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. విల్లు విద్యలో తన ప్రతిభను చాటుకోవాలని పరితపించిన ఓ యువకుడు కొన్ని అనూహ్య కారణాల వల్ల దాదాపు రేస్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి నుంచి తిరిగి రేసులో నిలిచి ఎలా ఛాంపియన్ అయ్యాడనే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ లక్ష్య సినిమా త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రానున్నట్టు మేకర్స్ ఈ టీజర్ ద్వారా వెల్లడించారు. నాగశౌర్య ( Naga Shaurya ) మార్క్ సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్‌ నుంచి లక్ష్య టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News