Naga Chaitanya Shobita Wedding Video Viral: పండితులు వేదమంత్రాల సాక్షిగా నిన్న డిసెంబర్ 4న శోభిత నాగచైతన్యల పెళ్లి ఘనంగా జరిగింది. వీరి పెళ్లి తంతు 8 గంటలపాటు సంప్రదాయబద్ధంగా జరిగింది. బుధవారం సరిగ్గా రాత్రి 8.13 గంటల సమయంలో శోభిత మెడలో నాగచైతన్య మూడుముళ్లు వేశాడు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో నాగచైతన్య శోభిత జంటతోపాటు నాగార్జున, అమల, వెంటేశ్, దగ్గుపాటి సురేష్ బాబుతోపాటు మిగతా కుటుంబ సభ్యులు కనిపించారు. ఇక తాళి కట్టిన శుభవేళ కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా కనిపించారు. ముఖ్యంగా ఈ పెళ్లిలో అఖిల్ తన అన్నయ్య పెళ్లి జరగడంతో ఆనందంగా విజిల్ కూడా వేయడం ఈ పెళ్లికి మరో హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
నాగచైతన్య శోభితల పెళ్లి అన్నపూర్ణ స్టూడియో వేధికగా టెంపుల్ సెటప్‌లో వైభవంగా 8 గంట క్రతువు నిర్వహించారు. ఇక ఈ పెళ్లిలో శోభిత బంగారు రంగు జరీ చీర ధరించి వాటికి తగిన బంగారు నగలను ధరించగా, నాగచైతన్య ఎరుపు బార్డర్ ఉన్న పంచ కట్టి సంప్రదాయబద్ధంగా కనిపించారు. అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడు ఫోటోలు బయటకు వస్తాయని ఎదురు చూస్తున్న వేళ ఇప్పుడు నాగచైతన్య శోభిత మెడలో తాళికట్టిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.
ఇక నాగచైతన్య శోభితల నిశ్చితార్థం ఇదే ఏడాది ఆగష్టు నెలలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే, అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా ఇటీవలె జరిగింది. దీన్ని అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. జైనబ్‌తో ఎనిమిదేళ్ల పరిచయం ప్రేమగా మారి వారు కూడా నిశ్చితార్ధం చేసుకున్నారు. వీరి పెళ్లి వచ్చే ఏడాది జరగనుందని నాగార్జున మీడియాకు చెప్పారు.
ఇదీ చదవండి: Pushpa2: పుష్ప2 ప్రీమియర్స్ షోలో తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు..!
ఇక నాగచైతన్యకు ఇది రెండో వివాహం ఆయన మొదట హిరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 'ఏమాయ చేసవే' సినిమా సమయంలో వీరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి 'మజిలీ' సినిమా కూడా చేశారు. అయితే, వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో 2021లో వీరు వీడిపోతున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వీళ్లు విడిపోవడానికి అస్సలు కారణం ఇప్పటి వరకు తెలియలేదు.
ఇదీ చదవండి: బంగారు జరీ చీరలో శోభిత.. తెల్లటి పంచలో నాగచైతన్య పెళ్లి ఫోటోలు చూశారా?
#SoChayWedding
Happy Married Life @chay_akkineni 😍🙏 Annayya @sobhitaD Vadhina
Congratulations both you 💐💐🤗🤗 #NagaChaithanya #SobhitaDhulipala #ChaySho #ChaySo pic.twitter.com/dg8uafZK2n— chaitu saami😍🙏 (@MJitendra999) December 5, 2024
ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఆ సినిమాలో నాగచైతన్యతోపాటు సాయిపల్లవి నటిస్తోంది. ఇక సమంత రూత్ ప్రభు తన కెరీర్‌లో బిజీ అయింది. ఈ మధ్యే సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. మరోవైపు శోభిత నాగచైతన్యలు ఓ సినిమా ఈవెంట్‌లో కలుసుకున్నారు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యుల అనుమతితో నిశ్చితార్థం కూడా జరిగింది. ప్రస్తుతం వీరు మూడు ముళ్లతో ఏకం అయ్యారు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter