Samantha: ఏంటమ్మా ఇది.. మా వాడు బంగారం కదా.. సమంతను దెప్పిపొడుస్తున్న చైతూ ఫాన్స్!

Naga Chaitanya Fans Targeting Samantha: కాఫీ విత్ కరణ్ షోలో చైతన్యను మాజీ భర్త అని చెబుతూ కామెంట్ చేసిన సమంత గురించి నాగచైతన్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 23, 2022, 08:31 AM IST
  • సమంతను టార్గెట్ చేసిన చైతూ ఫాన్స్
  • మా వాడు బంగారం మీరేంటి ఇలా అంటూ ప్రశ్నలు
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చైతూ ఫాన్స్
Samantha: ఏంటమ్మా ఇది.. మా వాడు బంగారం కదా.. సమంతను దెప్పిపొడుస్తున్న చైతూ ఫాన్స్!

Naga Chaitanya Fans Targeting Samantha: అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని దాదాపు పది నెలల పైనే అవుతుంది. అయినా వారి గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో కనబడుతూనే ఉంటుంది. తాజాగా సమంత కాఫీ విత్ కరణ్ షోలో తన మాజీ భర్త అంటూ నాగచైతన్యను ప్రస్తావించడం మీద కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సమంత ఇటీవలే కాఫీ విత్ కరణ్ షోలో అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా కరణ్ జోహార్ ఒక ప్రశ్నలో మీ భర్త చైతన్య అని సంబోధిస్తుండగా వెంటనే అందుకున్న సమంత భర్త కాదు మాజీ భర్త అంటూ కరెక్షన్ చేసింది.

అయితే ఈ మధ్యనే థాంక్యూ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక తమిళ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ నాగచైతన్య మాత్రం సమంత గురించి చాలా పొందికగా సామ్ అంటూ మాట్లాడడం కనిపించింది. ఆన్ స్క్రీన్ లో బెస్ట్ కెమిస్ట్రీ ఎవరితో ఉంటుందని అడిగితే ఫస్ట్ చైతన్య సాయి పల్లవి గురించి ప్రస్తావించాడు. లవ్ స్టోరీ సినిమాలో ఆమెతో కెమిస్ట్రీ వల్ల సీన్స్ బాగా కుదిరాయి అని చెప్పుకొచ్చారు. ఇక అలాగే ఆన్ స్క్రీన్ లో సమంతకు తనకు కూడా మంచి లవ్ స్టోరీస్ ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

అలా సాయి పల్లవి, సమంత పేర్లను నాగ చైతన్య ప్రస్తావించాడు. కానీ సమంత మాత్రం నాగచైతన్య మాజీ భర్త అంటూ అవమానించింది అంటూ ఇప్పుడు నాగచైతన్య అభిమానులు భావిస్తున్నారు. మా హీరో బంగారం, కానీ సమంత ఎలా మాట్లాడుతుందో చూడండి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. నిజానికి విడిపోయాడు కాబట్టి చైతన్య అసలు సమంత గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు ఆయన ఇప్పటికే చాలామంది హీరోయిన్లతో నటించాడు కాబట్టి ఎవరో ఒకరితో కెమిస్ట్రీ బాగుందని చెబితే సరిపోతుంది.

కానీ నిజంగా సమంతతో కెమిస్ట్రీ బాగుంది కాబట్టి ఎలాంటి ఇగోకు వెళ్లకుండా ఆమె పేరు ప్రస్తావించాడని నాగచైతన్య అభిమానులు ప్రస్తావిస్తున్నారు. కానీ సమంత మాత్రం నాగచైతన్య ఏదో ఘోరం చేసినట్లుగా అతని పేరు తీసుకొస్తేనే చిరాకుగా స్పందించి పరువు తీస్తోందంటూ నాగచైతన్య అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అంతేకాక తమ ఇద్దరినీ ఒక గదిలో పెడితే పదునైన వస్తువులు దాచేయాలి అంటూ చెప్పి తమ వివాదాన్ని అనవసరంగా బయట పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోందని వారు చెబుతున్నారు.

ముందు నుంచి కూడా సమంత తనను తాను బాధితురాలుగా చెప్పుకోవడానికి ఇష్టపడుతూ చైతన్యను బ్యాడ్ చేయడానికి ప్రయత్నిస్తోందని వారు అంటున్నారు. ఇది కరెక్ట్ కాదని అక్కినేని నాగచైతన్య అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చైతూ ఎంతో పొందికగా ఒక పెద్ద మనిషి తరహాలో సమాధానం ఇస్తే సమంత మాత్రం ఇలా మాట్లాడడం ఏమీ బాలేదని వారు అంటున్నారు. మరి ఈ విషయంలో మీకు ఏమి అనిపిస్తోందో కూడా కామెంట్ చేయండి మరి.

Also Read: Sree Vishnu: తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్ కు శ్రీ విష్ణు.. అసలు ఏమైంది?

Also Read:  తాతలు తండ్రులు అంటూ విజయ్ దేవరకొండ కామెంట్స్.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News