Naga Chaitanya Calls Samantha: పుట్టెడు దుఃఖంలో సమంత.. అభయమిచ్చిన చైతూ!

Nagachaitanya Called Samantha: అనారోగ్యంతో బాధ పడుతున్న తన మాజీ భార్య సమంతను ఎట్టకేలకు నాగచైతన్య పరామర్శించారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 6, 2022, 08:15 PM IST
Naga Chaitanya Calls Samantha: పుట్టెడు దుఃఖంలో సమంత.. అభయమిచ్చిన చైతూ!

Nagachaitanya Called Samantha Ruthprabhu for Consoling: తెలుగులో ఏం మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన సమంతా రూత్ ప్రభు తరువాత అనేక సినిమాలు చేస్తూ తెలుగు వారికి బాగా దగ్గరైంది. తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించిన ఆమె అనూహ్యంగా తాను మొదటి సినిమా చేసిన నాగచైతన్యతోనే ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకుంది. వీరిద్దరి జంటను చూసి తెలుగు ప్రేక్షకులు చాలా ఆనందించేవారు. తెలుగులో క్యూట్ కపుల్ అంటూ వీరి గురించి అనేకసార్లు అనేక కథనాలు కూడా వచ్చాయి.

అయితే ఎవరి కన్ను పడిందో? ఎలా వివాదాలు మొదలయ్యాయి తెలియదు కానీ వీరిద్దరూ విడిపోతున్నట్లు గత ఏడాది అక్టోబర్ నెలలో ప్రకటించారు. ఇక వీరు విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించినప్పటి నుంచి వీరి మధ్య వివాదానికి కారణం ఇదే అంటూ అనేక రకాల వార్తలు తెరమీదకు వచ్చాయి. ఎందుకో కానీ సమంతది తప్పని ఎక్కువగా కథనాలు ప్రచారం అవుతూ వచ్చాయి. అయితే అవన్నీ మనసుకు తీసుకుని ఒత్తిడి ఫీల్ అయి  బాధపడిందో ఏమో తెలియదు కానీ ఆమె ఒక అరుదైన ప్రాణాంతక వ్యాధి బారిన పడింది.

తాను మయోసైటిస్ అనే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధపడుతున్నట్లుగా ఇటీవల సమంత ఒక ప్రకటన చేసింది. ఇది అరుదైన వ్యాధని, ప్రాణాంతక వ్యాధి అని తెలియడంతో ఆమె అభిమానులు అందరూ తల్లడిల్లి పోతున్నారు. టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కోరుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా ఆమె మాజీ భర్త నాగచైతన్య నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాక పోవడంతో వారి మీద పలువురు విమర్శలు కూడా కురిపిస్తున్నారు.

నిజానికి తన మాజీ వదిన అనారోగ్యం మీద అక్కినేని అఖిల్ స్పందించారని ప్రచారం జరిగింది కానీ ఆయన సోషల్ మీడియా ఎకౌంట్ నుంచి స్పందించిన దాఖలాలు అయితే లేవు. అక్కినేని సుశాంత్ స్పందించారని అంటున్నారు కానీ అది కూడా ఎంతవరకు నిజమో చెప్పలేము. ఇక కొన్నాళ్ల క్రితం అయితే ఏకంగా నాగచైతన్య సమంత చికిత్స పొందుతున్న హాస్పిటల్ కి వెళ్లి ఆయన పరామర్శించారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ అది కూడా నిజం కాదని తేలింది.

ఇక తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు సమంతను నాగచైతన్య నాగార్జున కలిసి వెళ్లి పరామర్శించాలని అనుకున్నారట. కానీ నాగచైతన్య బిజీ షెడ్యూల్ కారణంగా కలవలేకపోతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సమంతకు కాల్ చేసిన నాగచైతన్య ధైర్యం చెప్పారని త్వరలోనే తాను వచ్చి కలుస్తానని కూడా చెప్పారనే ప్రచారం అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ ఈ వార్త అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ట్రెండ్ అవుతుంది.

Also Read: Arjun complaint: విశ్వక్ హ్యాండిచ్చాడు.. మంచు విష్ణుకు అర్జున్ ఫిర్యాదు!

Also Read: Ram Gopal Varma: మునుగోడుపై బాంబుల వర్షం.. రంగంలోకి ఐఎస్ఐఎస్, అల్ ఖైదా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News