N Shankar Web Series: దర్శకుడు ఎన్. శంకర్ డేరింగ్ స్టెప్.. మహా నాయకుల నేపథ్యంలో వెబ్ సిరీస్ నిర్మాణం..

N Shankar Web Series: సినీ పరిశ్రమలో కొద్ది మంది మాత్రమే తమ పేరుతో పాపులర్ అవుతారు. అలాంటి వాళ్లలో ఎన్. శంకర్ ముందు వరుసలో ఉంటారు.ఈయన దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందారు. తాజాగా ఈయన మూడు చారిత్రక వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్నట్టు తెలిపారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 28, 2024, 04:16 PM IST
N Shankar Web Series: దర్శకుడు ఎన్. శంకర్ డేరింగ్ స్టెప్.. మహా నాయకుల నేపథ్యంలో వెబ్ సిరీస్ నిర్మాణం..

N Shankar Web Series: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా సత్తా చాటిన ఎన్. శంకర్.. ముందుగా సూపర్ స్టార్ కృష్ణతో 'ఎన్‌కౌంటర్'మూవీ తెరకెక్కించారు. ఆ తర్వాత శ్రీరాములయ్య, యమజాతకుడు, ఆయుధం, జై బోలో తెలంగాణ వంటి సినిమాలతో  పాపులర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సినీ ఇండస్ట్రీ నుంచి తన వాయిస్ వినిపించారు. తాజాగా ఈయన నిర్మాతగా.. దర్శకత్వ పర్యవేక్షణలో మూడు వెబ్ సిరీస్‌లను తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. ముందుగా తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. అందులో తెలంగాణ సాయుధ పోరాటం నుంచి రాష్ట్ర సాధన వరకు జరిగిన పరిణామాలను ఇందులో చూపించనున్నారు. 

తెలంగాణ సాయిధ పోరాటంలో ప్ర‌జ‌లే, సైనికులుగా
యుద్ధం చేయాల్సి వచ్చిన ప‌రిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించనున్నారు. మరోవైపు తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థలైన జమీందార్, జాగీర్దార్ వ్యవస్థల కారణంగా సామాన్యులపై జరిగిన దాష్టీకాలతో పాటు ముఖ్యంగా  తెలంగాణ ప్రాంతం భారత యూనియన్ లో కలపబడాన్ని చూపించనున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడటం..ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాలు, పాలకుల నిర్ణయాలు..రాజకీయ, సామాజిక, ఆర్థిక అసమానతలు, ప్రజల తరఫున ఉద్య‌మాలు.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులు మేధావుల పంచిన చైతన్యం, విద్యార్ధుల త్యాగాలను ఇందులో చూపించనున్నట్టు చెప్పారు. అక్టోబర్ నుంచి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలు కానుంది. 

రెండవ వెబ్ సిరీస్ మ‌హాత్మ జ్యోతీరావు పూలే స్ఫూర్తితో తెరకెక్కించనున్నారు.. 
మహాత్మ జ్యోతిరావు పూలే అనుభవాలు, ఆయన జీవితంలో జరిగిన సంఘటన సమాహారంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించబోతున్నట్టు చెప్పారు. మహిళ విద్య కోసం తన భార్య సావిత్రి బాయి పూలె ద్వారా ఎలా సమాజంలో మార్పు తీసుకొచ్చారనే విషయాన్ని ఇందులో ప్రస్తావించనున్నారట. ఆయన జీవితం, త్యాగాలు, అవమానాలు, ఆయన చేసిన బోధనలను ఈ వెబ్ సిరీస్‌లో చూపించనున్నారు. 

మూడో వెబ్ సిరీస్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు దేశానికి చేసిన సేవలు, అట్టడుగు ప్రజలకు, అణగారిన వర్గాలకు ఇచ్చిన రాజ్యంగ స్పూర్తిని ఆయన జీవితంలో అనుభవించిన కష్టాలను ఇందులో ప్రస్తావించనున్నారు. వ్యక్తి నుంచి వ్యవస్థగా  ఎలా మారారనే ఇతివృత్తంతో ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. 

మ‌హాత్మ జ్యోతిరావు పూలేతో పాటు డా.బాబాసాహెబ్అంబేద్క‌ర్‌ల తెరకెక్కించబోతున్న వెబ్‌సీరీస్‌ వారి బ‌యోగ్ర‌ఫీలు కాదని చెప్పారు. వారి జీవితంలో జరిగిన కొన్ని కీలక ఘట్టాల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ నిర్మాణం జరగనుంది.రియల్ లైఫ్‌లో ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌లు అనుభవించారు. వారు పొందిన అవ‌మానాలు, గౌర‌వాలు, ఇలా అన్ని ఈ త‌రం వారికి తెలియ‌జెప్పాల‌నే ల‌క్ష్యంతో ఈ వెబ్‌సీరీస్ ‌లను తెరకెక్కించబోతున్నట్టు చెప్పారు. 

ఈ మూడు వెబ్‌సీరీస్‌ల‌ను కూడా పూర్తి పకడ్బందీ స్క్రీన్ ప్లేతో విధంగా హిందీ, తెలుగు భాష‌ల్లో నిర్మిస్తామన్నారు. మూడేళ్ల నుంచి మా టీమ్‌తో కలిసి ఈ కథలపై వర్క్ చేస్తున్నామన్నారు. త్వరలో పూర్తి వివరాలను పంచుకుంటామన్నారు. 

Also Read: FD Interest Rates: ఎఫ్‌డీలపై అత్యధికంగా 9.50 శాతం వరకూ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News