Mumbai Police: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు సమన్లు

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) తనను లైగింకంగా వేధించాడని సోషల్ మీడియా వేదికగా నటి నటి పాయల్‌ ఘోష్‌ (Payal Ghosh) ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలు.. నిరాధారమైనవని దర్శకుడు అనురాగ్ కశ్యప్ సైతం ఖండించారు.

Last Updated : Sep 30, 2020, 06:01 PM IST
Mumbai Police: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు సమన్లు

Mumbai Police summons Anurag Kashyap: న్యూఢిల్లీ: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) తనను లైగింకంగా వేధించాడని సోషల్ మీడియా వేదికగా నటి నటి పాయల్‌ ఘోష్‌ (Payal Ghosh) ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలు.. నిరాధారమైనవని.. దర్శకుడు అనురాగ్ కశ్యప్ సైతం ఖండించారు. అయితే ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ పాయల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) కోరండంతోపాటు.. పాయల్ ఘోష్ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీని స్వయంగా కలిసి విన్నవించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అనురాగ్‌ తనను లైంగికంగా వేధించాడని ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అనురాగ్‌పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్లు 376(ఐ), 354, 341, 342 సెక్షన్ల కింద కేసు న‌మోదు చేశారు. అయితే దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరిపేందుకు ముంబై పోలీసులు (Mumbai Police) సంసిద్దమయ్యారు. ఈ రకు అనురాగ్ కశ్యప్‌కు సమన్లు అందించారు. Also read: Kalki Koechlin About Anurag Kashyap: మా ఆయన బంగారం: అనురాగ్ కశ్యప్ మాజీ భార్య

ఈ మేరకు బాలీవుడ్‌ (Bollywood) దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌కు ముంబైలోని వెర్సోవా పోలీసులు బుధవారం సమన్లు పంపించారు. దర్యాప్తులో భాగంగా గురువారం (అక్టోబరు 1న) ఉదయం 11 గంటలకు పోలీసు స్టేషన్‌లో హాజరు కావాలని నోటీసులు అందించారు. అయితే ఈ కేసులో రేపు బాంబే పోలీసులు మరింత విచారణ చేపట్టనున్నారు. ఇదిలాఉంటే.. ముంబై పోలీసులు నోటీసులు ఇవ్వడంపై పాయల్ ఘోష్ స్పందించింది. ఈ సందర్భంగా ముంబై పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్ చేసింది. Also  read: UPSC Civil Exam: వాయిదాకు సుప్రీం నో.. యథాతథంగా సివిల్ పరీక్ష

అయితే.. తనకు కథ చెబుతానని చెప్పిన అనురాగ్ కశ్యప్ తన గదిలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించారని.. ఆ సమయంలో అనురాగ్‌ కశ్యప్‌ 'బాంబే వెల్‌వెట్‌' సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడని ఈ ఘటన 2015-16 నాటికి సంబంధించినదని ఆమె ట్విట్టర్‌లో ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని అనురాగ్ కశ్యప్ పేర్కొన్న విషయం తెలిసిందే. Also read: Babri Masjid Demolition Verdict: బాబ్రీ కూల్చివేత ప్లాన్ కాదు.. అందరూ నిర్దోషులే

Trending News