Megastar Kalyan Ram hashtag trending in twitter: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హిట్ కొట్టి చాలా కాలమైంది. అప్పుడెప్పుడో పటాస్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన మళ్ళీ హిట్టు కొట్టడానికి చాలా సమయం పట్టింది. ఇటీవల బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ ఎట్టకేలకు మరో హిట్ అందుకున్నాడు. కళ్యాణ్ రామ్ చాన్నాళ్ల తర్వాత హిట్ అందుకోవడంతో నందమూరి అభిమానులైతే గాల్లో తేలిపోతున్నారు. వారంతా కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా డిజాస్టర్ అయిన నేపథ్యంలో మెగా ఫాన్స్ కు కోపం తెప్పించే విధంగా మెగాస్టార్ కళ్యాణ్ రామ్ అంటూ ట్వీట్లు చేస్తూ ట్విట్టర్లో ట్రెండ్ సృష్టించారు నందమూరి అభిమానులు. అయితే నందమూరి అభిమానులు ఏమో మేము అలా చేయమని ఇది ఎవరో కావాలనేది గొడవలు సృష్టించడానికి చేసిన పని లాగా ఉందని అభివర్ణిస్తున్నారు. వీరు ఇలా కొట్టుకుంటుంటే మెగాస్టార్ మాత్రం ఎలాంటి భేషజాలకు పోకుండా నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా హిట్ కావడంతో సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
కంటెంట్ బాగుండే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు సినిమాలను ఆదరిస్తారని చెబుతూ బింబిసార, సీతారామం సినిమాల యూనిట్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అయితే నందమూరి అభిమానులు మాత్రం మెగాస్టార్ కళ్యాణ్ రామ్ అంటూ ట్వీట్లు చేయడంతో మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నందమూరి అభిమానులు మెగా అభిమానుల మధ్య ట్విట్టర్లో ఈ విషయం మీద పెద్ద ఎత్తున వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఒక సినిమా హిట్ కొట్టినంత మాత్రాన మెగాస్టార్ అనే ట్యాగ్ వాడడం ఎంతవరకు కరెక్ట్ అని మెగా అభిమానులు ప్రశ్నిస్తుంటే ఆచార్య లాంటి సినిమా కంటే బింబిసార చాలా బాగుందంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక బింబిసార సహా సీతారామం సినిమాలు మంచి టాక్ తెచ్చుకోవడంతో తెలుగు హీరోలే కాకుండా సాధారణ ప్రేక్షకుల సైతం సినిమా యూనిట్ల మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి మంచి సినిమాలు తీస్తూ ఉంటే చూడడానికి ఎలాంటి ఇబ్బంది లేదని వారు కామెంట్లు చేస్తున్నారు.
Read Also: Kalyan Ram: ఈ విజయం మాది కాదు.. యావత్ తెలుగు సినీ పరిశ్రమది!
Read Also: Pruthvi Raj: జనసేనకు జైకొట్టిన పృథ్వీరాజ్.. ఆరోజే పవన్ సమక్షంలో చేరిక?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook