'కరోనా వైరస్' విస్తరిస్తున్న నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో సినీ ప్రముఖులు ఇళ్లల్లోనే ఉండి లాక్ డౌన్ కాలాన్ని సరదాగా కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు.
మెగాఫ్యామిలీ లాక్ డౌన్ కాలాన్ని బాగా ఎంజాయ్ చేస్తోంది. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నానమ్మ దగ్గర కొత్త కొత్త వంటకాలు నేర్చుకుంటున్నాడు. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. నానమ్మతో కలిసి బట్టర్ తయారు చేయడం నేర్చుకుంటున్నానని ట్వీట్ చేశాడు.
ఈ వీడియోపై ఇవాళ మెగాస్టార్ చిరంజీవి సరదాగా స్పందించారు. ''మై డియర్ బచ్చా.. మా అమ్మ దగ్గర నీ బట్టర్ ఉడకదురా..! ఫస్ట్ ప్లేస్ ఎప్పుడూ నాదే..! నువ్ ఎంత బటర్ వేసినా నీ ప్లేస్ బెటర్ కాదు..'' అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
మై డియర్ బచ్చా ...మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్ ‘ ఉడకదురా. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు నాదే. How much ever you BUTTER, your position will not become BETTER. But ... ...అదే guarantee నాకు మీ అమ్మ దగ్గర లేదనుకో 😜 https://t.co/x1AIBZR3lM
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 2, 2020