Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ త్వరలో పూర్తి

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు గుడ్‌న్యూస్. చిరు తాజా చిత్రం ఆచార్య. త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోబోతోంది. కరోనా పరిస్థితుల కారణంగా ఆలస్యమైన సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 27, 2021, 05:01 PM IST
Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ త్వరలో పూర్తి

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు గుడ్‌న్యూస్. చిరు తాజా చిత్రం ఆచార్య. త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోబోతోంది. కరోనా పరిస్థితుల కారణంగా ఆలస్యమైన సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ(Koratala siva), మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ మూవీ ఆచార్యపై తెలుగు సినీ పరిశ్రమలో భారీగా అంచనాలున్నాయి. వాస్తవానికి మే 13న విడుదల కావల్సి ఉండగా..కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్ నిలిచిపోయి ఆలస్యమైంది. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉంది. మరో 12 రోజుల షూటింగ్ మిగిలుంది. చిరంజీవి(Chiranjeevi), రామ్ చరణ్ మధ్య కీలక సన్నివేశం పూర్తయితే..సినిమా పూర్తయినట్టే. వచ్చే నెల రెండో వారంలో చివరి భాగం షూట్ కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో చాలా సినిమాల షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆచార్య సినిమాపై(Acharya movie) అటు తెలుగు సినీ పరిశ్రమ ఇటు అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా..పూజా హెగ్డే, రామ్ చరణ్ (Ram charan) కీలక పాత్రలో కన్పించనున్నారు. మణిశర్మ సంగీతం సినిమాకు హైలైట్ కానుంది. ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా క్లారిటీ రావల్సి ఉంది.

Also read: Prakash Raj, MAA elections: మా అసోసియేషన్‌ ఎన్నికల్లో నాన్-లోకల్ రాజకీయాలపై ప్రకాశ్ రాజ్ ఫైర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News